Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం

ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం

Auto Catches Fire

Auto Catches Fire: ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గురువారం ఉదయం తాడిమర్రి మండలం, చిల్లకొండయ్యపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. గుండంపల్లికి చెందిన మహిళలు వ్యవసాయ పనుల కోసం ఆటోలో చిల్లకొండపల్లి బయలుదేరారు. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. సామాన్లు పెట్టుకోవడానికి ఆటోపై ఇనుప స్టాండ్ ఏర్పాటు చేశారు.

GST: కొత్త జీఎస్టీ పరిధిలోకి మజ్జిగ, పెరుగు, లస్సీ.. వచ్చే నెల నుంచే అమలు

ఈ స్టాండుకు హై టెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ తగిలి, ఆటోకు నిప్పు అంటుకుంది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.