హమ్మయ్య, కరోనా టెస్టులో మేయర్ కు నెగిటివ్, వణుకు పుట్టించిన హోటల్ టీ

హమ్మయ్య. అనుమానాలు తొలిగాయి. భయం పోయింది. డాక్టర్ల సలహా మేరకు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్న నగర

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 10:31 AM IST
హమ్మయ్య, కరోనా టెస్టులో మేయర్ కు నెగిటివ్, వణుకు పుట్టించిన హోటల్ టీ

Updated On : June 8, 2020 / 10:31 AM IST

హమ్మయ్య. అనుమానాలు తొలిగాయి. భయం పోయింది. డాక్టర్ల సలహా మేరకు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్న నగర

హమ్మయ్య. అనుమానాలు తొలిగాయి. భయం పోయింది. డాక్టర్ల సలహా మేరకు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్న నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు నెగిటివ్‌ వచ్చింది. ఆయనకు కరోనా సోకలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో మేయర్ తో పాటు కుటుంబసభ్యులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు రిలాక్స్ అయ్యారు. 

కరోనా టెస్టులో మేయర్ కు నెగిటివ్:
మేయర్‌తో పాటు పలువురు ప్రజాపతినిధులు ఇటీవల ఓ హోటల్ లో చాయ్‌ తాగారు. కాగా, ఆ హోటల్ లో పని చేసే సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. హోటల్ లో చాయ్ తాగిన మేయర్ కి, ప్రజాప్రతినిధులకు వైరస్‌ సోకిందేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్నేహితులు, డాక్టర్ల సూచన మేరకు ముందు జాగ్రత్తగా మేయర్ బొంతు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో నెగిటివ్ వచ్చింది. మేయర్ కు వైరస్‌ సోకలేదని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌ఓ యాస వెంకటేశ్వర్లు తెలిపారు.

హడలెత్తించిన హోటల్ టీ:
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్‌ డ్రైవ్‌లో మేయర్‌ పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా జూన్ 3న రాంనగర్‌లోని అడిక్‌మెట్‌లో జరిగిన కార్యక్రమానికి మేయర్ బొంతు హాజరయ్యారు. చెత్తా చెదారం తొలగించిన తర్వాత అక్కడి షణ్ముఖ హోటల్‌లో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి చాయ్‌ తాగారు. అదే హోటల్‌లో పనిచేసే ఓ వ్యక్తికి మేయర్‌ చాయ్‌ తాగిన మరునాడే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో హోటల్‌లో చాయ్‌ తాగిన విషయం ప్రస్తావనకు రావడం, అందరూ అనుమానం వ్యక్తం చేస్తుండడంతో అపోహలు తొలగించేందుకు జూన్ 5న ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో మేయర్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కాగా, ఆ హోటల్‌లో కరోనా సోకిన వ్యక్తి అంతకంటే పది రోజుల ముందు నుంచే విధులకు రావడం లేదు. అయినప్పటికీ.. నిత్యం ప్రజల్లో తిరుగుతున్న దృష్ట్యా.. స్పష్టత కోసం పరీక్షలు చేయించుకున్నారు మేయర్.

Read: దసరా వరకు స్కూళ్లు తెరిచేది లేదు