Balakrishna Gopichand Film: బాలయ్య కోసం శృతిని ఒప్పించిన గోపీచంద్?

దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు మరో కథపై కసరత్తులు చేస్తున్నాడు. బాలయ్య లాంటి మాస్ హీరోతో సినిమా చేయనునున్న గోపీచంద్ అందుకోసం చరిత్ర పుస్తకాలను కూడా తిరగేస్తున్నాడు.

Balakrishna Gopichand Film: బాలయ్య కోసం శృతిని ఒప్పించిన గోపీచంద్?

Gopichand Who Convinced Shruti For Balayya

Updated On : May 17, 2021 / 12:40 PM IST

Balakrishna Gopichand Film: దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు మరో కథపై కసరత్తులు చేస్తున్నాడు. బాలయ్య లాంటి మాస్ హీరోతో సినిమా చేయనునున్న గోపీచంద్ అందుకోసం చరిత్ర పుస్తకాలను కూడా తిరగేస్తున్నాడు. క్రాక్ కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాలోని కొన్ని నిజజీవిత క్యారెక్టర్లను ఒక కథగా మార్చి తెరకెక్కించినట్లుగానే ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం కూడా వేట కొనసాగిస్తున్నాడు. మరోవైపు బాలయ్య లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోకు జోడీగా మరో స్టార్ హీరోయిన్ ను జత చేసి సినిమాకు హైప్ పెంచాలని గోపిచంద్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే శృతి హాసన్ గోపీచంద్ తో బలుపు, క్రాక్ సినిమాలకు పనిచేసింది. పైగా ఇప్పుడు శృతి సెకండ్ ఇన్నింగ్స్ గా భావిస్తూ వరస సినిమాలకు సైన్ చేస్తుంది. దీంతో మరోసారి ఆమెనే తన సినిమాకు కరెక్ట్ అని భావిస్తున్న దర్శకుడు బాలయ్య సినిమా కోసం శృతిని ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. ఇప్పటికే శృతికి స్టోరీ లైన్ నేరేట్ చేసిన గోపీచంద్ దాదాపుగా ఒప్పించినట్లు తెలుస్తుంది. కరోనా విరామమిస్తే జులై నుండి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట.

పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలో అదే ప్రాంతంలో చరిత్రలో నిలిచిన మరికొన్ని పాత్రలను కూడా చూపించనున్నారట. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని గోపీచంద్ ప్లాన్ చేస్తుండగా ఇప్పటికే మిగతా క్యాస్టింగ్ ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య ఈ సినిమా పూర్తవగానే గోపిచంద్ సినిమా కోసమే పనిచేయనున్నాడట.