ప్రభుత్వం నిర్ణయం కోసం గ్రేటర్ ఆర్టీసీ ఎదురు చూపు

హైదరాబాద్ లో మళ్లా బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయి ? అనే చర్చ జరుగుతోంది. బస్సుల కోసం ప్రయాణీకులు ఎదురు చూస్తున్నట్లుగానే..ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రభుత్వ అనుమతి కోసం వెయిట్ చేస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ లోకి వెళ్లిన సంస్థలు ఒక్కొక్కటిగా కార్యకలపాలు స్టార్ట్ చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలని టి.సర్కార్ ఆదేశించింది. వీరిని తీసుకెళ్లడానికి ఆర్టీసీ బస్సులు కొన్నింటిని నడుపుతోంది. నగరంలోని వివిధ చోట్ల నుంచి కార్యాలయాలకు వచ్చే వారికి బస్సు సౌకర్యం కల్పించింది.
కానీ..పూర్తిగా ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. కానీ..కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండడం..జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతుండడంతో ప్రభుత్వం అనుమతినిస్తుందా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా బస్సులు నడిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ ప్రధాన ప్రాంతమైన హైదరాబాద్ లో మాత్రం బస్సును రోడ్డెక్కడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్ర్సతుతం 2020, మే 25వ తేదీ సోమవారం నుంచి విమాన రాకపోకలు సాగించనున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయానికి తిరిగే..షటిల్, ఎలక్ట్రికల్ సర్వీసులు నడిపేందుకు అనుమతినివ్వాలని ఆర్టీసీ కోరిందని తెలుస్తోంది. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ కంపల్సరీ తదితర నిబంధనలు పెట్టాయి. 70 మందిని కూర్చొనే విధంగా ఉన్న బస్సుల్లో కేవలం 30 మందిని మాత్రమే ఎక్కించుకొనే ఛాన్స్ ఉంది. మరి ప్రభుత్వం అనుమతినిస్తుందా ? లేకపోతే..మే 31 వరకు వరకు ఇదే కంటిన్యూ చేయనుందా ? అనేది రానున్న రోజుల్లో తేలియనుంది.