Viral Wedding Card: వరుడు పేరు సోషలిజం.. వధువు మమతా బెనర్జీ!

వరుడు పేరు సోషలిజం.. వధువు మమతా బెనర్జీ.. వరుడి సోదరులు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం. సోషలిజానికి తాజాగా మమతా బెనర్జీతో పెళ్లి కాగా ఇప్పుడు వీరి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ ఇజం పేర్ల వెనుక కథేంటి?.. ఈ వెడ్డింగ్ కార్డు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Viral Wedding Card: వరుడు పేరు సోషలిజం.. వధువు మమతా బెనర్జీ!

Viral Wedding Card (1)

Updated On : June 11, 2021 / 1:14 PM IST

Viral Wedding Card: వరుడు పేరు సోషలిజం.. వధువు మమతా బెనర్జీ.. వరుడి సోదరులు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం. సోషలిజానికి తాజాగా మమతా బెనర్జీతో పెళ్లి కాగా ఇప్పుడు వీరి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ ఇజం పేర్ల వెనుక కథేంటి?.. ఈ వెడ్డింగ్ కార్డు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడుకు చెందిన పి.మమతా బెనర్జీ, ఏఎం సోషలిజం తాజాగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి శుభలేఖలో పేర్లు కాస్త వైవిధ్యంగా ఉండడంతో అదికాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Viral Wedding Card

Viral Wedding Card

వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో పిల్లలకు పేర్లు కూడా ఆ స్ఫూర్తిని కలిగించేలా పెట్టారు. ప్రస్తుతం సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న వరుడు తండ్రి లెనిన్‌ మోహన్‌ తన కుమారులు సహా వధువు పేర్ల వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. వారి స్వగ్రామం కత్తూరులో కమ్యూనిజం మీద మక్కువతో ఈ విధంగా పేర్లను పెట్టుకుంటారని చెప్పిన లెనిన్ మోహన్ రష్యా, మాస్కో, జెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మణి లాంటి పేర్లు అక్కడ చాలా సాధారణంగా వినిపిస్తాయని చెప్పారు.

Viral Wedding Card

Viral Wedding Card

ఇక వధువు మమతా బెనర్జీ పేరు వెనుక కథ చూస్తే.. ఆమె తాత కాంగ్రెస్ వాది కాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద మక్కువతో ఆ పేరు పెట్టారట. ముందు తరాలకు తమ భావాలను అందించేందుకే ఈ పేర్లను పెట్టినట్లు గర్వంగా చెప్తున్న ఈ రెండు కుటుంబాలు సోషలిజం-మమతా బెనర్జీ జంటకు ఆడపిల్ల పుడితే క్యూబాయిజం అని పేరు పెడతామని సగర్వంగా చెప్తున్నారు. ఈ పేర్ల వెనుక కథ ఎలా ఉన్నా వీళ్ళ శుభలేఖ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.