Pawan Kalyan: పవర్ స్టార్‌తో హరీష్ శంకర్ సినిమా.. ముహూర్తం ఫిక్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. అందుకే పవన్ కూడా హరీష్ శంకర్ మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తాడు. ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని చాలాసార్లు ప్రచారం జరిగినా

Pawan Kalyan: పవర్ స్టార్‌తో హరీష్ శంకర్ సినిమా.. ముహూర్తం ఫిక్స్?

Harish Shankar Film Confirm With Pawan Kalyan

Updated On : June 7, 2021 / 2:42 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. అందుకే పవన్ కూడా హరీష్ శంకర్ మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తాడు. ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని చాలాసార్లు ప్రచారం జరిగినా ఎందుకో అది ఆచరణ కాలేదు. కానీ ఈసారి మాత్రం పక్కా ఈ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇప్పటికే పలుమార్పు ఇద్దరి మధ్య కథాచర్చలు జరగగా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తుంది.

పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుం కోషియం సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే మూడో సినిమాను కూడా లైన్లో పెట్టనున్నాడట. అదే హరీష్ శంకర్ సినిమా. ఆగస్టు నుండి ఈ సినిమా కోసం పవన్ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా.. నెలకు పది రోజుల చొప్పున పవన్ డేట్స్ ఇచ్చాడని చెప్తున్నారు.

పవన్ డేట్స్ ఇచ్చిన వార్తతో పాటు ఈ సినిమా కథకు సంబంధించి కూడా ప్రచారం ఒకటుంది. ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు తెలుస్తుండగా.. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రతో పాటు లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవనే కనిపించనున్నాడని చెప్తున్నారు. ఒకనాడు వరస ప్లాపులలో ఉన్న పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరీష్ శంకర్.