Weather Alert: రాయలసీమకు భారీ వర్షాలు.. ఉత్తర, దక్షణ కోస్తాకు..

తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు తెలిపాయి.

Weather Alert: రాయలసీమకు భారీ వర్షాలు.. ఉత్తర, దక్షణ కోస్తాకు..

Weather Alert

Updated On : July 3, 2021 / 4:53 PM IST

Weather Alert: తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు తెలిపాయి. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక, ఉత్తర, దక్షిణ కోస్తాలో.. శనివారం నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురవనుండగా పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.

ఇక తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పాటు 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి నెలకొంది. దీని కారణంగా శని, ఆదివారాలు ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.