ఆండ్రాయిడ్, ఐఫోన్లలో TikTok Username మార్చడం తెలుసా?

మీరు టిక్ టాక్ యూజర్లా? మీ టిక్ టాక్ యూజర్ నేమ్ ఏంటి? మీరు ఎంచుకునే యూజర్ నేమ్‌తోనే మీ వీడియోలన్నీ పాపులర్ అవుతాయి. మిలియన్ల వ్యూస్, ఫాలోవర్లను సంపాదించి పెడుతుంది. ఒకవేళ మీ టిక్ టాక్ యూజర్ నేమ్ ఎట్రాక్టివ్ గా మార్చుకోవాలని అనుకుంటున్నారా?
అయితే టిక్ టాక్ యూజర్ నేమ్ ఎలా మార్చుకోవాలో తెలుసా? మీరు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ యూజర్లు అయితే ఈ కిందివిధంగా ఫాలో అవ్వండి.. బైట్ డాన్స్ సొంత వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం అయిన టిక్ టాక్ అకౌంట్లో మీకు నచ్చిన యూజర్ నేమ్ సెట్ చేసుకోండి.. అది ఎలానో ఓసారి చూద్దాం..
1. మీ మొబైల్ డివైజ్‌లో TikTok అకౌంట్ ఓపెన్ చేయండి. కిందివైపు కుడివైపు భాగంలో profile tabపై నొక్కండి.
2. ఇప్పుడు Edit profile బటన్‌పై tap చేయండి.
3. మీ username పై tap చేయండి.
4. ఇక్కడ కొత్త యూజర్ నేమ్ టైప్ చేసి Save buttonపై క్లిక్ చేయండి.
5. టిక్‌టాక్ యూజర్ నేమ్… 30 రోజుల్లో ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంది.
6. లెటర్స్, నెంబర్లు, అండర్ స్కోర్స్ (-) పిరియడ్స్ మాత్రమే వాడేందుకు అనుమతి.
7. ఇదివరకే యూజర్ నేమ్ వాడుకలో ఉంటే అది పనిచేయదు.. మీకో వార్నింగ్ మెసేజ్ వస్తుంది.
8. ఈ యూజర్ నేమ్ అందుబాటులో లేదని చూపిస్తుంది. కొత్త యూజర్ నేమ్ సజెస్ట్ చేస్తుంది.
9. ఒకవేళ మీ యూజర్ నేమ్ అందుబాటులో ఉంటే.. గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది.
10. యూజర్ నేమ్‌లో లెటర్స్, నెంబర్లు, అండర్ స్కోర్, పిరియడ్స్ ఉండేలా చూసుకోండి.