జీమెయిల్‌లో Google Meet హైడ్ చేయడం తెలుసా?

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ Google Meet అనే ఫీచర్ రిలీజ్ చేసింది. వీడియో చాటింగ్ ప్రొగ్రామ్ Hangouts Meetను మార్చేసి సరికొత్త వెర్షన్ రూపొందించింది. అదే.. Google Meet. గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతిఒక్కరికి ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. మీ జీమెయిల్ ఇన్ బాక్స్ నుంచి Meet వీడియో కాన్ఫరెన్స్‌లో జాయిన్ కావొచ్చు. గూగుల్ పేజీలోని ఎడమవైపు భాగంలో గూగుల్ మీట్ జాయిన్ బటన్ ద్వారా అందులో పాల్గొనవచ్చు.
కానీ, ఒకవేళ మీరు ఈ Meet ఫీచర్ అవసరం లేదని భావిస్తే మీట్ బటన్ డిజేబుల్ లేదా హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. (మీరు ఒకవేళ కార్పొరేట్ G Suite అకౌంట్లో ఉన్నప్పుడు మాత్రమే). అప్పుడు ఈ ఫీచర్ మీరు హైడ్ చేయడం కుదరదు. అది కూడా మీ అడ్మినిస్ట్రేషన్ సెట్టింగ్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ జీమెయిల్ అకౌంట్లో గూగుల్ మీట్ ఎలా హైడ్ చేయాలో ఓసారి చూద్దాం..
* Gmail ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో cog ఐకాన్ పై క్లిక్ చేయండి.
* డ్రాప్ డౌన్ మెనులో Settings క్లిక్ చేయండి.
* Chat and Meet ట్యాబ్ పై Click చేయండి.
* ఇక్కడ Meet లేబుల్ సెలెక్ట్ చేయండి. మెయిన్ మెనూలో Meet Section హైడ్ చేయండి.
* Save Changes పై క్లిక్ చేయండి. అంతే…
* ఒకవేళ మీరు జీమెయిల్‌లో Meet షార్ట్ కట్ హైడ్ చేస్తే.. https://meet.google.com/ లింక్ ద్వారా ఈజీగా Meet యాక్సస్ చేసుకోవచ్చు.
Read: ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్: పాత చెత్త పోస్టులను హైడ్ చేయండిలా!