In The Name of God : ప్రియదర్శి పర్ఫార్మెన్స్..! టీజర్ ఇంకో రేంజ్‌లో ఉంది..

ప్రియదర్శి డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు.. కథ, కథనాలు ఏంటనే ఆసక్తిని రేకెత్తిస్తూ సాగిన ఈ టీజర్ సిరీస్‌పై అంచనాలు పెంచేసింది..

In The Name of God : ప్రియదర్శి పర్ఫార్మెన్స్..! టీజర్ ఇంకో రేంజ్‌లో ఉంది..

In The Name Of God

Updated On : June 12, 2021 / 11:31 AM IST

In The Name of God: బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. ‘మెయిల్’, ‘లెవన్త్ అవర్’, ‘థ్యాంక్ యు బ్రదర్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత హార్డ్ హిట్టింగ్ ఇన్టెన్స్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్‌జీ) తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది. ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు.

‘భాషా’,‘ప్రేమ’, ‘మాస్టర్’ చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్ నిర్మించడం విశేషం. ‘ఆటో శంకర్’ వంటి బహుభాషా వెబ్ షోస్‌ను రూపొందించిన రంగా యాలి ఈ వెబ్ సిరీస్‌కు షో రనర్‌గా వ్యవహరిస్తున్నారు. విద్యాసాగ‌ర్ ముత్తుకుమార్ ఈ ఏడు ఎపిసోడ్స్‌ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు..

రీసెంట్‌గా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ టీజర్ రిలీజ్ చేశారు. ప్రియదర్శి డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు. కథ, కథనాలు ఏంటనే ఆసక్తిని రేకెత్తిస్తూ సాగిన ఈ టీజర్ సిరీస్‌పై అంచనాలు పెంచేసింది. వ‌రుణ్ డీకే సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ వెబ్ సిరీస్‌ను రాజ‌మండ్రి, మారేడు మిల్లి, హైద‌రాబాద్‌ల‌లో చిత్రీక‌రించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది.. త్వరలో ‘ఆహా’ లో ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ స్ట్రీమింగ్ కానుంది.

ఇళ్ల‌లోకే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను తీసుకొస్తాన‌ని ప్రామిస్ చేసిన ‘ఆహా’… ‘క్రాక్‌’, ‘గాలి సంప‌త్‌’, ‘నాంది’, ‘జాంబి రెడ్డి’, ‘సుల్తాన్‌’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌తో పాటు వెబ్ షోస్‌, సిరీస్‌, ఒరిజిన‌ల్స్‌తో త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటోంది..