Rajya Sabha polls: కె.లక్ష్మణ్ సహా 8 మంది బీజేపీ నేతలు నామినేషన్ల దాఖలు
బీజేపీ తెలంగాణ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సహా ఎనిమిది మంది ఆ పార్టీ నేతలు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకుగాను నామినేషన్లు దాఖలు చేశారు.

Laksh
Rajya Sabha polls: బీజేపీ తెలంగాణ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సహా ఎనిమిది మంది ఆ పార్టీ నేతలు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకుగాను నామినేషన్లు దాఖలు చేశారు. ఆ సమయంలో వారితో పాటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్, సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య, ఇతర బీజేపీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
IMD: ముందుగా ప్రకటించిన దానికంటే ఈ వానాకాలంలో అధిక వర్షపాతం
నామినేషన్లు దాఖలు చేసిన వారిలో లక్ష్మణ్‌తో పాటు బీజేపీ నేతలు లక్ష్మీకాంత్ వాజ్‌పేయీ, మితిలేశ్ కుమార్, రాధా మోహన్ దాస్ అగర్వాల్, సురేంద్ర సింగ్ నాగర్, బాబూరామ్ నిషాద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 11 రాజ్యసభ సీట్లకుగాను నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారమే చివరి తేదీ. కాగా, గతంలో తెలంగాణలో కె.లక్ష్మణ్ ఎమ్మెల్యేగాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పని చేశారు.