Special Berths for Female Passengers : రైళ్లలో మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్తులు : మంత్రి అశ్విని వైష్ణవ్

మహిళా ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అతివలూ సీట్ల కోసం ఆందోళన చెందవద్దు అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భరోసా ఇచ్చారు.

Special Berths for Female Passengers : రైళ్లలో మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్తులు : మంత్రి అశ్విని వైష్ణవ్

Special berths for Female Passengers

Updated On : November 7, 2022 / 2:32 PM IST

Special berths for Female Passengers: మహిళా ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అతివలూ సీట్ల కోసం ఆందోళన చెందవద్దు అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భరోసా ఇచ్చారు. మహిళా ప్రయాణికుల కోసం పలు రైళ్లలో ప్రత్యేక బెర్తులు సిద్ధం చేస్తామని..మహిళల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సాధారణంగా బస్సుల్లోను..మెట్రో రైళ్లలోను మహిళలకు ప్రత్యేక సీట్లు రిజర్వ్ ఉంటాయి. ఇటువంటి సౌకర్యం రైళ్లలో లేదు. ఈక్రమంలో మహిళల సౌకర్యం, భద్రత కోసం రైల్వే శాఖ ఇటువంటి ఆలోచన చేసింది.

భారతీయ రైల్వే మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. సుదూరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లలో ఆరు బెర్తుల సీట్లు మహిళలకు కేటాయిస్తున్నామని రైల్వే మంత్రి తెలిపారు. కొన్ని కంపార్ట్ మెంట్లలో ఆరు బెర్తులను మహిళలకు కేటాయించామని మంత్రి తెలిపారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని..రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో సహా పలు ఇతర సౌకర్యాలను ప్రారంభించిందని తెలిపారు.

కేంద్ర తెలిపిన రైళ్లలో ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు నుంచి ఏడు వరకు లోయర్ బెర్త్‌లు, ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ కోచ్‌లో 4 నుంచి 5 లోయర్ బెర్త్‌లు, ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ కోచ్‌లో 3 నుంచి 4 లోయర్ బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌ల కోసం రిజర్వ్ చేస్తోంది కేంద్ర రైల్వే శాఖ. దాంతోపాటు 45 అంతకంటే ఎక్కువ వయుసు ఉన్న మహిళా ప్రయాణీకులకు, గర్భిణీలకు రైలులో ఆ క్లాస్‌కు సంబంధించిన ఆయా కోచ్‌ల సంఖ్య ఆధారంగా సీట్ రిజర్వేషన్ కానున్నాయి.