Egg Yolk : కోడిగుడ్డులో పచ్చసొన తింటే ప్రమాదమా?..

కోడి గుడ్డును ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తితోపాటు, మాంసకృత్తులు అందుతాయి. కండ నిర్మాణానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

Egg Yolk : కోడిగుడ్డులో పచ్చసొన తింటే ప్రమాదమా?..

Egg

Updated On : August 11, 2021 / 11:40 AM IST

Egg Yolk : ఆరోగ్యానికి కోడి గుడ్డు తినంటం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చిన్నారుల నుండి పెద్దల వరకు దీనిని అంతా ఇష్టంగా తింటుంటారు. గ్రుడ్డు పైభాగం తెల్లని పెంకుతో కప్పబడి లోపలి బాగంలో తెల్లసొన పచ్చసొనగా ఉంటాయి. ఉడకబెట్టుకుని , అమ్లెట్ గా వేసుకుని, వేపుడుగా, పులుసుగా ఇలా వివిధ రకాల వంటల రూపంలో కోడిగుడ్డును తింటుంటారు. ప్రతిరోజు కోడి గుడ్డు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

కోడి గుడ్డును ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తితోపాటు, మాంసకృత్తులు అందుతాయి. కండ నిర్మాణానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన కోడి గుడ్డులో 6.29గ్రాముల ప్రొటీన్స్, 78క్యాలరీలు కలిగి ఉంటుంది. అయితే చాలా మంది కోడి గుడ్డులోని పచ్చసొనను తినేందుకు ఏమాత్రం ఇష్టపడరు. పచ్చసొన తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుందన్న అపోహతో ఉంటారు. పచ్చసొన తింటే గుండెజబ్బులు వచ్చేస్తాయన్న ప్రచారం కూడా ఉంది.

అయితే వాస్తవానికి గుడ్డులోని పచ్చసొనలో జీవక్రియకు అవసరమైన అమైనో అమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్ ఎ, డి, బి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డును ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎదుగుతున్న చిన్నారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మానసిక ఎదుగుదల తోపాటు, చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. పచ్చసొన లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్యలు దూరమౌతాయి.

గుడ్డులోని తెల్లసొన మాత్రమే ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ఫలితం ఉండదు. గుడ్డు మొత్తం తినటం వల్లే అందులో ఉన్న పోషకాలన్నీ మనశరీరానానికి సరిపడినంత మోతాదులో అందుతాయి. రక్తంలో ఉండే మంచి కొవ్వు అయిన హెచ్ డీ ఎల్ స్ధాయిలు మెరుగుపడటంతోపాటు, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికి దోహదం చేస్తుంది. అయితే వైద్యులు సూచించిన విధంగా మాత్రమే గ్రుడ్లను ఆహారంగా తీసుకోవాలి. ప్రతిరోజు రెండు నుండి మూడు కోడి గ్రుడ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతకు మించి తీసుకోవటం అంత శ్రేయస్కరం కాదు.