ఇజ్రాయెల్‌లో వీధికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 09:18 AM IST
ఇజ్రాయెల్‌లో వీధికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు

Updated On : May 10, 2020 / 9:18 AM IST

రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా.. ఇజ్రాయెల్ టెల్ అవీవ్‌లో ఒక వీధికి ఠాగుర్ పేరు పెట్టి నివాళి అర్పించింది. భారతదేశంలో ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ విషయాన్ని షేర్ చేసింది. ‘ఈ రోజు.. ప్రతిరోజూ #RabindranathTagoreను గౌరవిస్తాము. మానవజాతికి ఆయన చేసిన విలువైన సహకారాన్ని జ్ఞాపకార్థంగా టెల్ అవీవ్‌లో ఒక వీధికి పేరు పెట్టాము’ అని ట్వీట్ చేసింది. 

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కవి జన్మదినం సందర్భంగా ఇజ్రాయెల్ దీనికి ఠాగూర్ వీధి అని పేరు పెట్టింది. ఈ ట్వీట్ పోస్టు చేయగానే నెటిజన్లు ఇజ్రాయెల్ ప్రశంసించారు. ‘ప్రపంచ కవి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ పుట్టినరోజు. జ్ఞాపకం చేసుకున్నందుకు ఇజ్రాయెల్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఠాగూర్ పేరు మీద ఇజ్రాయెల్ రవీంద్ర జయంతిని జరుపుకోగా, అభిమానులు ఇంటర్నెట్‌లో తమ ప్రత్యేక లాక్‌డౌన్ నివాళితో బార్డ్ ఆఫ్ బెంగాల్‌ను జరుపుకున్నారు.

కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఈ సంవత్సరం రవీంద్ర సదన్‌లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని రద్దు చేసింది. రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ నందన్ కాంప్లెక్స్ లోపల ఉన్న రవీంద్ర సదన్ వద్ద నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం, రవీంద్ర జయంతిని బెంగాలీ నెల బోయిషాక్ 25వ రోజు జరుపుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ క్యాలెండర్ 1268లో ఇదే రోజున జన్మించారు.