Bengaluru : అద్దెకు తీసుకున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు.. తలుపు తెరిచి చూసిన ఓనర్ అవాక్కయ్యాడు..

ఇల్లు అద్దెకు ఇచ్చేటపుడు తాము ఎలా ఇచ్చామో తిరిగి అలాగే అప్పగించాలని యజమానులు రిక్వెస్ట్ చేస్తుంటారు. ఒక అద్దె ఇంటిని ఐటీ ఉద్యోగి ఎలా మార్చేసాడో చూస్తే అవాక్కైపోతారు. తన ఇంటిని చూసుకుని యజమాని పరిస్థితి ఎలా ఉందంటే?

Bengaluru : అద్దెకు తీసుకున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు.. తలుపు తెరిచి చూసిన ఓనర్ అవాక్కయ్యాడు..

Bengaluru

Updated On : April 27, 2023 / 12:26 PM IST

Bengaluru : బెంగళూరులో అద్దెకి ఇల్లు దొరకడం అంటే గగనమే. అలాంటిది దొరికిన ఇంట్లో హాయిగా ఉండకుండా అదృశ్యమయ్యాడు ఓ ఐటీ ఉద్యోగి. అనుమానం వచ్చిన ఓనర్ తలుపు తెరిచి చూసి అవాక్కయ్యాడు.

Zero Shadow Day : పట్టపగలు కనిపించని నీడ .. బెంగళూరులో జీరో షాడో డే వింత..!!

బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగి 4 నెలల అద్దె అడ్వాన్స్ చెల్లించి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. ఉన్నట్టుండి యజమానికి ఫోన్ చేసి తాను చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి కావాలని కోరాడు. అయితే తన ప్లాట్‌ను ఖాళీ చేసి అప్పగించాల్సిందిగా యజమాని కోరాడు.  అయితే ఖాళీ చేసి ఇవ్వడానికి కాలయాపన జరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఓనర్  ప్లాట్ తలుపులు తెరిచి చూసాడు. అంతే షాకవ్వడం యజమాని వంతైంది.

తన ఇంటిని చూసి యజమానికి మాటలు రాలేదు. కిటీలు తెరిచి ఉన్నాయి. పావురాలు ఇంటిని పాడు చేసాయి. ప్రతి చోట మద్యం తాగిన సీసాలతో నిండి ఉంది. ఇక ఇల్లు అనే కంటే చెత్తకుప్పలా కనిపించింది. ఇక ఈ మేటర్‌ని రవి హందా అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. “బ్యాచిలర్స్‌కి అద్దెకు ఇవ్వడానికి యజమానులు అందుకే ఇష్టపడరని.. చదువుకుని.. బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేసేవారు ఇలాగేనా ఇంటిని ఉంచుకునేది” అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

housing crisis : అద్దె ఇంటి కోసం ఐపీఎల్ మ్యాచ్‌ని వదల్లేదుగా.. బెంగళూరులో ఓ వ్యక్తి ఏం చేసాడో చూడండి

ఇక ఈ పోస్ట్ చూసిన వారిలో కొందరు.. ‘ఓనర్ డిపాజిట్ తిరిగి ఇవ్వకుండా ఇంటిని శుభ్రం చేయించుకోవాలని’ సలహా ఇచ్చారు. ‘హారిబుల్’ అని కొందరు.. ‘అందుకే సరైన రూమ్మేట్‌ని చూసుకోవాలని’ సరదాగా మరికొందరు రిప్లై చేస్తున్నారు. ఇల్లు దొరకడమే గగనమైపోయిన వేళ ఇలాంటి పనులు చేస్తే బ్యాచులర్స్‌కి బెంగళూరులో ఇల్లు దొరకడం కష్టమే అనిపిస్తోంది.