Zero Shadow Day : పట్టపగలు కనిపించని నీడ .. బెంగళూరులో జీరో షాడో డే వింత..!!

పట్టపగలు, మిట్టమధ్యాహ్నాం మనుషుల నీడ కనిపించని అద్భుతం చోటుచేసుకుంది. ఈ వింత గురించి శాస్త్రవేత్తలు అరుదైన విషయాలు తెలిపారు.

Zero Shadow Day : పట్టపగలు కనిపించని నీడ .. బెంగళూరులో జీరో షాడో డే వింత..!!

Zero Shadow Day In Bengalore

Zero Shadow Day : ‘నా నీడ పోయింది సార్’అంటూ ఫిర్యాదు చేస్తాడో ఓ సినిమాలో హీరో. అది విన్న పోలీసులు షాక్ అవుతారు. ఇది సినిమా. కానీ బెంగళూరులో ఇటువంటి అరుదైన సంఘటనే చోటుచేసుకుంది ఈరోజు అంటే మంగళవారం. ఏప్రిల్ 25 (2023)పట్టపగలు మిట్టమధ్యాహ్నాం బెంగళూరు వాసులు మా నీడ మాయమైంది అంటున్నారు. కోరమంగళంలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ క్యాంపస్ లో ఓ ఈవెంట్ నిర్వహించి నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంట్లో భాగంగా సరిగ్గా మధ్యాహ్నం 12:17 గంటలకు ఎండలో నిటారుగా ఉన్న వస్తువులకు నీడ కనిపించలేదు. అలా ఒకటిన్నర నిమిషాల పాటు వారి నీడ వారికి కనిపించని అద్భుతం జరిగింది. 130 ఉత్తర అక్షాంశం వెండబి అన్ని ప్రదేశాలలో (మధ్యాహ్నా 12.17)సరిగ్గా తలపైకి సూర్యుడు చేరుకున్న సమయంలో నీడ అదృశ్యమవుతుందని అంటే కనిపించదని తెలిపారు.

ఇటువంటివి జరుగుతుంటాయని ఈ వింతను ‘జీరో షాడో’ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడు నేరుగా భూమధ్యరేఖపైకి వచ్చినప్పుడు ఇలా ‘జీరో షాడో డే’ సంభవిస్తుందని ప్రతీ సంవత్సరం ఇలా రెండుసార్లు జరుగుతుందని చెబుతున్నారు. 2021లో ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటుచేసుకున్న ఈ ఖగోళ అద్భుతం ఈసారి బెంగళూరులో కనిపించిందని తెలిపారు.

జీరో షాడో డే 130 అక్షాంశాల నుండి దూరంగా ఉన్న ప్రదేశాలలో వేర్వేరు రోజులలో జరుగుతుందని..జవహర్‌లాల్ నెహ్రూ ప్లానిటోరియం ఒక పత్రికా ప్రకటనలో, ప్లానిటోరియం సమన్వయంతో సైన్స్ సెంటర్‌లనుఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నంలో కర్ణాటక అంతటా వివిధ సైన్స్ యాక్టివిటీ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యకలాపాలలో విద్యార్థుల కోసం వర్క్‌షాప్‌లు, పోస్టర్ ఎగ్జిబిషన్‌లు, సూర్యుని ఉపరితల లక్షణాలను వీక్షించడానికి టెలిస్కోప్‌లను ఉపయోగించడం, సూర్యరశ్మిలను పరిశీలించడానికి సౌర స్కోప్‌ల ఉపయోగం వంటివి ఉంటాయని తెలిపారు.

ఏమిటీ జీరో షాడో డే..
వెలుతురు ఉంటే నీడ ఉన్నట్లే. మనం నీడ మనల్ని వెన్నంటేఉంటుంది. సూర్యకాంతిలో మనం నడుస్తున్నప్పుడు మన నీడ ఆయా సమయాలను (ఉదయం,మధ్యాహ్నాం, సాయంత్రం)బట్టి నీడు పడే ప్రదేశం మారుతుంటుంది. కానీ సూర్యకాంతి ఉన్నప్పటికీ నీడ కనిపించకపోవడమే జీరో షాడో. ఈ వింత జరిగిన రోజును జీరో షాడో డే అంటారు. 2023లో ఈ జీరో షాడో డే వింత బెంగళూరులో చోటుచేసుకుంది. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల ప్రకారం.. జీరో షాడో డే కర్కాటక రాశి, మకర రాశి మధ్య సంవత్సరానికి రెండుసార్లు కదులుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలోనూ సూర్యుని క్షీణత ఆ ప్రాంతాల అక్షాంశానికి సమానంగా ఉంటుంది. అందుకే సూర్యుడు నడి నెత్తిన కనిపిస్తాడు, దీంతో సూర్యకాంతి పడినప్పటికీ నీడ కనిపించదు.

ప్రతీ సంవత్సరం రెండుసార్లు ఈ అరుదైన వింత
ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో మరొకసారి ప్రతీ సంవత్సరం రెండు సార్లు ఈ వింత జరుగుతుంది..వాటిని జీరో షాడో డే గా వ్యవహరిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వింత కేలవం ఓ సెకను లేక సెకనున్నర మాత్రమే ఉంటుంది. కానీ బెంగళూరులో మాత్రం ఏకంగా ఒకటిన్నర నిమిషం ఉండటం అరుదనే చెబుతున్నారు.