Vijay Devarakonda: అందుకే విజయ్ అంటే ఇష్టమంటోన్న జాన్వీ!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ది మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. మనోడి ఫాలోయింగ్ ఒక్కసారిగా లైగర్ ట్రైలర్‌తో అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని.. దానికి సంబంధించిన కారణాలను కూడా వెల్లడించింది.

Vijay Devarakonda: అందుకే విజయ్ అంటే ఇష్టమంటోన్న జాన్వీ!

Updated On : August 7, 2022 / 6:41 PM IST

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ది మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. మనోడి ఫాలోయింగ్ ఒక్కసారిగా లైగర్ ట్రైలర్‌తో అమాంతం పెరిగిపోయింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్‌లో విజయ్ బాక్సర్‌గా మారేందుకు చేసిన డెడికేషన్ గురించి కూడా మనకు చూపించారు. దీంతో ఈ సినిమా కోసం కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Vijay Devarakonda : ముంబైలో మెగాస్టార్‌తో లైగర్ టీం

కేవలం కామన్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం విజయ్ దేవరకొండ అభిమానులుగా మారిపోతున్నారు. ఈ జాబితాలో తాజాగా అందాల భామ జాన్వీ కపూర్ కూడా యాడ్ అయ్యింది. ఇటీవల అమ్మడు ఓ టాక్ షోలో పాల్గొని ఇదే విషయాన్ని వెల్లడించింది. తనకు ప్రస్తుతం ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. ‘‘అతడు నిజమైన స్టార్ అని.. అతడికి యాక్టింగ్ పుట్టుకతోనే వచ్చిందని.. ఇంతటి స్టార్‌గా ఎదిగినా, ఇంతటి ఫాలోయింగ్ ఉన్నా.. అతడు ఇంకా ఏదో సాధించాలని చూస్తున్నాడు. ఈ లక్షణాల కారణంగానే విజయ్ అంటే నాకు ఇష్టం’’ అంటూ జాన్వీ తన మనసులోని మాటను బయపెట్టింది.

Vijay Devarakonda : అందరికి అతనే కావాలి.. విజయ్ దేవరకొండ మీద కన్నేసిన హీరోయిన్స్..

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ చిత్ర ప్రమోషన్స్‌లో యమ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను బాలీవుడ్‌లో స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.