వాల్యూ లేని వజ్రాలు.. మన ‘జాతిరత్నాలు’..

Jathi Ratnalu: ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘జాతిరత్నాలు’.. ఫరియా అబ్దుల్లా కథానాయికగా పరిచయమవుతోంది.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, స్వప్న సినిమాతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. శుక్రవారం ‘జాతిరత్నాలు’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఫన్నీగా ఆకట్టుకుంటోంది.
https://10tv.in/chitti-lyrical-video-song-from-jathi-ratnalu-movie/
నవీన్, ప్రియదర్శి, రాహుల్ తమ కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్‌తో అలరించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగా కుదిరాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘జాతి రత్నాలు’ సినిమా మార్చి 11న విడుదల కానుంది.