కూ చుక్ చుక్ : June 01 నుంచి..200 ప్యాసింజర్ రైళ్లు

  • Published By: madhu ,Published On : May 20, 2020 / 01:54 AM IST
కూ చుక్ చుక్ : June 01 నుంచి..200 ప్యాసింజర్ రైళ్లు

Updated On : May 20, 2020 / 1:54 AM IST

కరోనా వైరస్ కారణంగా పట్టాలపై పరుగులు తీయని రైళ్లు..ఇక నుంచి చుక్..చుక్ అంటూ వెళ్లనున్నాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్న వారు రైళ్లు తిరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరికి మేలు చేకూర్చే విధంగా రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 200 నాన్ – ఏసీ రైళ్లను నడుపుతామని వెల్లడించింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2020, మే 19వ తేదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఏయే నగరాలను కలుపుతూ..ఈ రైళ్లను నడపబోతున్నారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

నాన్ ఏసీ, రెండో తరగతి కోచ్ లు గల ఈ రైళ్లను రోజు నడుపనున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకొనేందుకు ప్రయాణీకులకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. శ్రామిక్ ప్రత్యేక రైళలో వెళ్లకపోయిన..వలస కార్మికుల జాబితాలను అందచేస్తే..ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తామని, వచ్చే రెండు రోజుల్లో..శ్రామిక ప్రత్యేక రైళ్లను రెట్టింపు చేస్తామని తెలిపింది. 

కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయంతో శ్రామిక్‌ రైళ్ల సంఖ్య పెరగనుంది. అందుబాటులో ఉన్న లెక్కలప్రకారం గుజరాత్‌నుంచి రైల్వేశాఖ 496 రైళ్లను నడపగా..మరో 17 రైళ్లు సిద్ధంగా ఉన్నాయ్..అలానే మహారాష్ట్ర నుంచి 266 శ్రామిక్ రైళ్లు వెళ్లగా..37 రైళ్లు నడవడానికి సిద్ధంగా ఉన్నాయ్..పంజాబ్ నుంచి 188, కర్నాటక నుంచి 89, తమిళనాడు నుంచి 61, తెలంగాణ నుంచి 58, రాజస్థాన్ నుంచి 54, హర్యానా నుంచి 41, యూపీ నుంచి 38 రైళ్లు నడిచాయ్..మొత్తంగా చూస్తే..యూపీ నుంచి అత్యధికంగా 641రైళ్లు నడవగా..73 రెడీగా ఉన్నాయ్…బీహార్ 310 శ్రామిక్ రైళ్లు నడవగా..మరో 53 రెడీగా ఉన్నాయ్..మొత్తంగా చూస్తే.. ఇప్పటికి 20 లక్షల మందికి పైగా వలస కార్మికులను స్వస్థలాలకు శ్రామిక్ రైళ్లద్వారా చేర్చినట్లు కేంద్రం ప్రకటించింది.

 

Read: శ్రామిక్ రైళ్లకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు..రైల్వేశాఖ