Kedarnath Dham Yatra : భారీవర్షాలతో కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్
భారీవర్షాల కారణంగా బుధవారం కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. యాత్రికుల భద్రత దృష్ట్యా సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ డ్యూ వద్ద యాత్రికులను నిలిపివేశారు. భారీవర్షాల కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు దెబ్బతినడంతో యాత్రికుల రాకపోకలను మూసివేశారు....

Kedarnath Dham Yatra Stopped
Kedarnath Dham Yatra : భారీవర్షాల కారణంగా బుధవారం కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. యాత్రికుల భద్రత దృష్ట్యా సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ డ్యూ వద్ద యాత్రికులను నిలిపివేశారు. భారీవర్షాల కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు దెబ్బతినడంతో యాత్రికుల రాకపోకలను మూసివేశారు. (Kedarnath Dham Yatra Stopped) భారీ వర్షాల కారణంగా మందాకిని, అలకనంద నదులు ఉప్పొంగుతున్నాయని అధికారులు తెలిపారు.
China Visas : ఈ ఏడాది 71,600 మంది భారతీయులకు చైనా వీసాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) జులై 12 వతేదీన ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ అధికారులు ట్వీట్ చేశారు. వరదలతో ఉత్తరాఖండ్ వంతెన కొట్టుకుపోయింది. వంతెన తెగిపోవడంతో సరిహద్దు గ్రామాలతో సంబంధాలు కోల్పోయాయి.
18 Safe Cities : దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రం…ఏదంటే…
ప్రతి సంవత్సరం ఇక్కడ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘‘అధిక వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడతాయి, నదుల నీటిమట్టం పెరుగుతోంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్రమత్తమై సహాయ పునరావాస పనులు చేపట్టారని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి చెప్పారు.
Brij Bhushan : మహిళా విలేఖరిపై బ్రిజ్ భూషణ్ సింగ్ అనుచిత ప్రవర్తన
మంగళవారం ఉత్తరాఖండ్‌లోని గంగానదీ సమీపంలో గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడి నలుగురు వ్యక్తులు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు.