కీర్తి సురేష్.. ‘పైరేట్ ఆప్ ది పియానో’..

Keerthy Suresh: రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్టూడియోలో కీర్తి సురేష్ సందడి చేసింది. ఆమె పియానో ప్లే చేయడం చూసి దేవి సర్ ప్రైజ్ అయ్యి.. ‘పైరేట్ ఆప్ ది పియానో’ అనే బిరుదు ఇచ్చేశారు. కీర్తి పిక్స్ షేర్ చేసి కామెంట్ పోస్ట్ చేశారు.
నితిన్, కీర్తీ సురేష్ జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. దేవి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు డీఎస్పీ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి, కెమెరామెన్ పి.సి.శ్రీరామ్‌లతో కలిసి కీర్తి కూడా స్టూడియోకి వెళ్లింది.
అక్కడ తనకెంతో ఇష్టమైన పియానో చూడగానే ఇష్టంగా ప్లే చేసింది. కీర్తి పియానో ప్లే చేస్తుండగా దేవి పిక్స్ తీశారు. కీర్తి పియానో చాలా బాగా ప్లే చేసిందని, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యిండి నేనే ఆశ్చర్యపోయానని దేవి.. కీర్తి పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వైరల్ అవుతున్నాయి.