Kerala News: సీఎం పినరయి విజయన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సచివాలయ ఉద్యోగి తొలగింపు
వాట్సాప్ వేదికగా ఆ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై సీఎం కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ.. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు

Vijayan
Kerala News: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఆ రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. వాట్సాప్ వేదికగా ఆ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై సీఎం కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ.. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఇటీవల యూఏఈ(దుబాయ్) దేశంలో పర్యటించారు. కేరళ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా యూఏఈ మంత్రులు, అధికారులతో కలిసి దిగిన ఫోటోను సీఎం పినరయి విజయన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
Also read: Rahul Court Case: రాహుల్ గాంధీపై ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్ధతిలో కోర్టు విచారణ
సీఎం విజయన్ నల్ల సూట్ వేసుకుని ఉన్న ఆ ఫోటోను.. ఏ.మణికుట్టన్ అనే సచివాలయ ఉద్యోగి తన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు. “గూండాలు వేర్వేరు వేషధారణలో ఉన్నారు” అంటూ సీఎంపై మణికుట్టన్..అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్నీ కొందరు సచివాలయ అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా.. మణికుట్టన్ ను విధుల నుంచి తప్పించారు. కాగా మణికుట్టన్ కాంగ్రెస్ అనుకూల సచివాలయ ఉద్యోగుల సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. దీంతో అతనిపై కక్షకట్టిన అధికార పార్టీ అనుకూల ఉద్యోగులు కొందరు.. ఈచర్యకు పాల్పడ్డారు.
CM @vijayanpinarayi visited Dr. Abdul Rahman Bin Abdul Mannan Al Awar, UAE’s Minister of Human Resources and Emiratisation and @ThaniAlZeyoudi, UAE’s Minister of State for Foreign Trade. He expressed hope that these interactions would elevate Kerala’s industries. pic.twitter.com/WzQADPENRY
— CMO Kerala (@CMOKerala) February 3, 2022