KGF2: కేజీఎఫ్ 2 వరల్డ్‌వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ కేజీఎఫ్ 2 మేనియాతో ఊగిపోతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా.....

Kgf2
KGF2: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ కేజీఎఫ్ 2 మేనియాతో ఊగిపోతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని సినీ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. కాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ 2 చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ అదిరిపోయే హైప్ క్రియేట్ అయ్యింది.
KGF2: కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్!
ఇక ఈ హైప్ కారణంగా కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా స్టన్నింగ్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాకు వచ్చిన వసూళ్ల కారణంగా పార్ట్ 2 పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే ఈ సినిమాను భారీ రేటుకు డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. ఇక వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఏకంగా రూ.345 కోట్ల భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరిపిందంటే.. కేజీఎఫ్2 చిత్రంపై సినీ వర్గాల్లో ఏ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.
KGF2: కేజీఎఫ్ 2 ఎడిటర్ ఎవరో తెలిస్తే అవాక్కవడం ఖాయం!
కేవలం కన్నడలోనే కాకుండా ఈ సినిమాకు తెలుగు, హిందీ భాషల్లోనూ అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. అందుకే ఈ సినిమాకు ఇతర భాషల్లోనూ కళ్లుచెదిరే ప్రిలీజ్ బిజినెస్ జరిగినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. రాకింగ్ స్టార్ యశ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కాగా, ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – రూ.25 కోట్లు
సీడెడ్ – రూ.14 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.10 కోట్లు
ఈస్ట్ – రూ.7 కోట్లు
వెస్ట్ – రూ.6 కోట్లు
గుంటూరు – రూ.7 కోట్లు
కృష్ణా – రూ.6 కోట్లు
నెల్లూరు – రూ.3 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.78 కోట్లు(బ్రేక్ ఈవెన్ – రూ.79 కోట్లు)
కర్ణాటక – రూ.100 కోట్లు
తమిళనాడు – రూ.27 కోట్లు
కేరళ – రూ.10 కోట్లు
హిందీ – రూ.100 కోట్లు
ఓవర్సీస్ – రూ.30 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.345 కోట్లు