సంక్రాంతి కానుకగా ‘క్రాక్’

Krack: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘క్రాక్’.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది..
రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటివరకు విడుదల చేసిన సాంగ్స్, ప్రోమోస్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
https://10tv.in/balega-tagilavey-bangaram-lyrical-song-from-krack/
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయని, సంక్రాంతి కానుకగా జనవరి 14 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ తెలిపారు.
సంగీతం : థమన్, కెమెరా : జి.కె. విష్ణు, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్. ప్రకాష్, ఫైట్స్ : రామ్-లక్షణ్, డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా, చీఫ్ కో-డైరెక్టర్ : పి.వి.వి. సోమరాజు.