గోవా బయల్దేరిన మాస్ మహారాజా

  • Published By: sekhar ,Published On : December 3, 2020 / 02:07 PM IST
గోవా బయల్దేరిన మాస్ మహారాజా

Updated On : December 3, 2020 / 2:40 PM IST

Krack team off to Goa: ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాల తర్వాత మాస్‌ మహారాజా రవితేజ, గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్‌’. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.


శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘భూమ్ బద్దలు’ సాంగ్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ కోసం టీం గోవా బయల్దేరింది. రేపటినుంచి (డిసెంబర్ 4) గోవాలో రవితేజ, శృతిహాసన్‌లపై పాట పిక్చరైజ్ చేయనున్నారు.


గోవా వెళ్తున్నట్లు ఫ్లైట్‌లో తీసుకున్న సెల్ఫీ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు రవితేజ. మాస్కోన్ మాస్క్ ధరించి సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సంక్రాంతికి ‘క్రాక్’ ప్రేక్షకులముందుకు రానుంది.