Kuwait : ట్రాఫిక్ జరిమానాల విషయంలో… కువైత్ కీలక నిర్ణయం!…

ఇప్పటికే ఈ నిర్ణయానికి సంబంధించిన కువైత్ అంతర్గత వ్యవహార పర్యవేక్షణ మంత్రిత్వశాఖ అధికారులతో చర్చించింది. ట్రాఫిక్ విభాగం అధికారులు మంత్రి షేక్ థామెర్ అల్ అలీకి ప్రతిపాదనలు పంపినట్లు స్ధానిక వార్త పత్రికలు కధనాలు ప్రచురించాయి.

Kuwait : ట్రాఫిక్ జరిమానాల విషయంలో… కువైత్ కీలక నిర్ణయం!…

Kuwait

Updated On : August 5, 2021 / 12:36 PM IST

Kuwait : విదేశాలలో ట్రాఫిక్ నిబంధనలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించినా భారీ ఫైన్ లు విధిస్తారు. గల్ఫ్ దేశం కువైత్ లో కూడా ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో అక్కడి అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా రూల్స్ ను పక్కన పెడితే జరిమానాల వడ్డన భారీగానే ఉంటుంది.

ట్రాఫిక్ ఉల్లంఘటనలకు పాల్పడే స్ధానికుల నుండైతే జరిమానా సొమ్మును ముక్కుపిండి వసూలు చేసే అధికారులు, ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడ వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ ఉల్లఘనలకు పాల్పడే వారి నుండి జరిమానాలు వసూలు చేయటం పెద్ద సమస్యగా మారింది. ప్రవాసులపై ట్రాఫిక్ జరిమానాలు విధించినప్పటికీ వాటిని చెల్లించకుండానే దేశం విడిచివెళ్ళిపోతుండటంతో అక్కడి అధికారులు ఏంచేయలేని పరిస్ధితుల్లో ఉన్నారు. ఈక్రమంలో జరిమానాలు చెల్లించని ప్రవాసులు దేశం విడిచి వెళ్ళకుండా బ్యాన్ విధించాలన్న యోచనలో కువైత్ ప్రభుత్వం ఉంది.

ఇప్పటికే ఈ నిర్ణయానికి సంబంధించిన కువైత్ అంతర్గత వ్యవహార పర్యవేక్షణ మంత్రిత్వశాఖ అధికారులతో చర్చించింది. ట్రాఫిక్ విభాగం అధికారులు మంత్రి షేక్ థామెర్ అల్ అలీకి ప్రతిపాదనలు పంపినట్లు స్ధానిక వార్త పత్రికలు కధనాలు ప్రచురించాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించిన నందుకు విధించే ఫైన్లను చెల్లించే వరకు దేశం విడిచి వెళ్ళిపోకుండా వారిని నిలువరించే చర్యలు చేపట్టటం ప్రతిపాదనల్లో ప్రధానమైనది.

మరోవైపు కువైట్ లో ఉండే స్ధానికులు జరిమానాలు చెల్లించే వరకు వారికి అన్ని రకాల సేవలు నిలిపివేయాలని కూడా సూచించింది. జరిమానాలకు సంబంధించిన సందేశాలు పంపిన సమయంలో వెంటనే వాటిని చెల్లించాలని లేని పక్షం చర్యలు కఠినంగా ఉంటాయని కువైత్ ట్రాఫిక్ అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది ప్రవాసులు జరిమానాలు చెల్లించకుండా తమ దేశాలకు వెళ్ళిపోయారని పేర్కొంది. జరిమానాల నుండి రావాల్సింది పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తుంది.