Lal bagh : మమతా మోహన్ దాస్ ‘లాల్ బాగ్’ ఫస్ట్ లుక్..

రాజమౌళి, ఎన్టీఆర్‌ల కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్‌లో సాగే థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు..

Lal bagh : మమతా మోహన్ దాస్ ‘లాల్ బాగ్’ ఫస్ట్ లుక్..

Lal Bagh

Updated On : April 23, 2021 / 7:44 PM IST

Lal bagh: రాజమౌళి, ఎన్టీఆర్‌ల కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్‌లో సాగే థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు.

సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్‌పై రాజ్ జకారియా నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మమతామోహన్ దాస్ ఓ బలమైన పాత్రలో కనిపించబోతోందీ చిత్రంతో.

Lalbagh

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న ఈ మూవీలో మమతా మోహన్ దాస్‌తో పాటు నందిని రాయ్, సిజోయ్ వర్గీస్, రాహుల్ దేవ్ శెట్టి (బాలీవుడ్ యాక్టర్), రాహుల్ మాధవ్, అజిత్ కోషీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఏ. సంపత్ కుమార్ సగర్వంగా సమర్పిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : రాహుల్ రాజ్, సినిమాటోగ్రఫీ : ఆంటోని జో, ఎడిటర్ : సునీశ్ సెబాస్టియన్, నిర్మాత : రాజ్ జకారియాస్, దర్శకత్వం : ప్రశాంత్ మురళీ పద్మనాభన్..