Light exposure: రాత్రి సమయంలో శరీరంపై కాంతి పడేలా నిద్రపోతే ఆరోగ్యానికి ముప్పు
శరీరంపై కాంతి పడకుండా నిద్రపోయే వారితో పోల్చితే కాంతి పడేలా నిద్రపోయే వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను గుర్తించామని పరిశోధకులు చెప్పారు.

Sleep
Light exposure: రాత్రి నిద్రపోతున్న సమయంలో లైట్లు అన్నీ ఆఫ్ చేసి పడుకుంటాం. లైట్లు ఆఫ్ చేయనిదే చాలా మందికి నిద్రపట్టదు. అయితే, మారుతోన్న జీవనశైలి కారణంగా చాలా మంది లైట్లు ఆఫ్ చేయకుండా పడుకుంటున్నారు. అలాగే, నిద్రపోయేవరకు మంచంపై స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. టీవీని అర్ధరాత్రి వరకు చూసి ఆఫ్ చేయకుండానే పడుకుంటున్నారు. దీని వల్ల కూడా మనపై చాలాసేపు కాంతి పడుతుంది. కళ్ళు సహా శరీరంపై కాంతి పడేలా రాత్రి నిద్రపోయే వారిలో సంభవించే ఆరోగ్య సమస్యల గురించి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.
Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. నేడే ప్రమాణ స్వీకారం: ఫడ్నవీస్ ప్రకటన
శరీరంపై కాంతి పడకుండా నిద్రపోయే వారితో పోల్చితే కాంతి పడేలా నిద్రపోయే వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను గుర్తించామని పరిశోధకులు చెప్పారు. 60 ఏళ్ళు దాటిన వారిలో ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పరిశోధనలో పాల్గొన్న వారు చేతికి ప్రత్యేక డివైజ్ పెట్టుకునేలా చేశారు. ఆ డివైజ్ ద్వారా రాత్రి సమయంలో వారిపై పడ్డ కాంతికి సంబంధించిన గణాంకాలను ఏడు రోజుల పాటు నమోదు చేసుకున్నారు. రాత్రి నిద్రపోతున్న సమయంలో శరీరంపై ఎటువంటి కాంతి పడినా వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు.
Maharashtra Politics: వ్యూహం మార్చిన బీజేపీ.. ఆ అపవాదును తొలగించుకొనేందుకే షిండేకు సీఎం పదవి
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను స్లీప్ జర్నల్‌లో జూన్ 22న ప్రచురించారు. స్మార్ట్‌ఫోన్‌ను, టీవీని ఆన్‌లో ఉంచి, ఇతర లైట్లను ఆఫ్ చేయకుండా నిద్రపోయే అలవాట్లు పెరిగిపోయాయని పరిశోధకులు తెలిపారు. వృద్ధులకు సాధారణంగానే అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటి ముప్పు ఉంటుందని, రాత్రి తమపై కాంతి పడేలా నిద్రపోయే వారిలో ఈ ముప్పు మరింత పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు. కొందరు రాత్రి సమయంలో మూత్రానికి వెళ్ళే సమయంలో లైట్లు స్విచ్ ఆన్ చేసి, మళ్ళీ ఆఫ్ చేయకుండా పడుకుంటున్నట్లు తెలిసిందని అన్నారు. రాత్రి సమయంలో వీలైనంతవరకు కాంతి పడకుండా నిద్రపోయేందుకు ప్రయత్నించాలని సూచించారు.