Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. నేడే ప్రమాణ స్వీకారం: ఫడ్నవీస్ ప్రకటన
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే (శివసేన తిరుగుబాటు నేత) ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని వివరించారు.

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే (శివసేన తిరుగుబాటు నేత) ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి లేఖ అందించిన అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు.
Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫడ్నవీస్, షిండే
కేబినెట్‌లో తాను ఉండబోనని ఫడ్నవీస్ తెలిపారు. అయితే, ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తానని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో మిత్రత్వం వద్దని శివసేన ఎమ్మెల్యేలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని, అయితే, వారి డిమాండ్‌ను ఉద్ధవ్ ఠాక్రే పట్టించుకోలేదని ఫడ్నవీస్ చెప్పారు. మహా వికాస్ అఘాడీలోని కాంగ్రెస్, ఎన్సీపీలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. అందుకే శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని ఆయన చెప్పారు.
Maharashtra: ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ భేటీ.. ఫడ్నవీస్ ఇంటికి ఏక్‌నాథ్ షిండే
హిందుత్వ, సావర్కర్‌కు వ్యతిరేకంగా ఉన్న వారితో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ అన్నారు. ప్రజా తీర్పును కూడా శివసేన అవమానించిందని ఆయన చెప్పారు. 2019 వరకు బీజేపీ, శివసేన మిత్రత్వాన్ని కొనసాగించాయని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తి బలాన్ని సంపాదించాయని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న సమయంలో శివసేన మరోలా వ్యవహరించి, బాల్ ఠాక్రేకు వ్యతిరేకంగా పనిచేసిన వారితో పొత్తు పెట్టుకుందని ఆయన అన్నారు.