Maharashtra: ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ భేటీ.. ఫడ్నవీస్ ఇంటికి ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముంబైలోని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది.

Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముంబైలోని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం జరుగుతుండగా అక్కడకు శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే వచ్చారు. మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో తమ తదుపరి కార్యాచరణపై బీజేపీ చర్చలు జరుపుతోంది. పార్టీ కీలక నేతలు సీటీ రవి, చంద్రకాంత్ పాటిల్, గిరీశ్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Maharashtra: మంత్రి పదవులపై బీజేపీతో చర్చలు జరగలేదు: ఏక్‌నాథ్ షిండే
అంతేగాక, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి వెళ్ళారు. మరోవైపు, ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరుపుకున్నారు. తమ తదుపరి కార్యాచరణపై వారి చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో నేడు చర్చలు జరిపిన తర్వాత ఏక్‌నాథ్ షిండే తమ నిర్ణయంపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఎవరెవరిని ఏయే మంత్రి పదవి అనే అంశంపై ఇప్పటివరకు చర్చలు జరగలేదని షిండే ఇప్పటికే స్పష్టం చేశారు.