Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫ‌డ్న‌వీస్, షిండే

ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశ‌మివ్వాల‌ని మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారీని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే కోరారు. మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు ఇరువురు నేత‌లు లేఖ అందించారు.

Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫ‌డ్న‌వీస్, షిండే

Maharastra

Maharashtra: ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశ‌మివ్వాల‌ని మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారీని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే కోరారు. మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు ఇరువురు నేత‌లు లేఖ అందించారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ‌ద్ద‌తు త‌మ‌కు పూర్తి స్థాయిలో ఉంద‌ని పేర్కొన్నారు.

Maharashtra: ‘హ‌ర‌హ‌ర మ‌హాదేవ..’ అంటూ సీఎం ఉద్ధ‌వ్ రాజీనామాపై హీరోయిన్ కంగ‌న స్పంద‌న‌

ముంబైలోని దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ నివాసంలో బీజేపీ కోర్ క‌మిటీ స‌మావేశం ముగిసిన వెంట‌నే దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఏక్‌నాథ్ షిండే నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్ళ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ వ‌ద్ద దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని ఏక్‌నాథ్ షిండే చెబుతున్నారు. వీలైతే నేటి సాయంత్ర‌మే శివ‌సేన తిరుగుబాటు నేత‌ల‌తో క‌లిసి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రుల జాబితాల‌ను బీజేపీ ఇప్ప‌టికే సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం. సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని తెలుస్తోంది.

Maharashtra: మంత్రి ప‌ద‌వుల‌పై బీజేపీతో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు: ఏక్‌నాథ్ షిండే
అనంత‌రం ఫ‌డ్న‌వీస్ మీడియాతో మాట్లాడుతూ.. ఓవైపు శివ‌సేన దావూద్ ఇబ్రహీంపై విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని, మ‌రోవైపు అత‌డికి సాయం చేసిన మంత్రి (న‌వాబ్ మాలిక్‌)ను మాత్రం మంత్రిగా కొన‌సాగిస్తోంద‌ని చెప్పారు. సావ‌ర్క‌ర్‌ను అవ‌మానించిన వారితో శివ‌సేన మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తోంద‌ని విమ‌ర్శించారు. రెండేళ్ళలో మహారాష్ట్రలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన అన్నారు.