Maharashtra: ‘హ‌ర‌హ‌ర మ‌హాదేవ..’ అంటూ సీఎం ఉద్ధ‌వ్ రాజీనామాపై హీరోయిన్ కంగ‌న స్పంద‌న‌

'శివుడి 12వ అవ‌తార‌మే హ‌నుమంతుడు.. హ‌నుమాన్ చాలీసాను నిషేధించిన శివ‌సేనను శివుడు కూడా కాపాడ‌లేడు. హ‌ర‌హ‌ర మ‌హాదేవ.. జై హింద్, జై మ‌హారాష్ట్ర' అని కంగ‌నా ర‌నౌత్ వీడియో రూపంలో మాట్లాడింది. కాగా, నిన్న రాత్రి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.

Maharashtra: ‘హ‌ర‌హ‌ర మ‌హాదేవ..’ అంటూ సీఎం ఉద్ధ‌వ్ రాజీనామాపై హీరోయిన్ కంగ‌న స్పంద‌న‌

Kangana

Maharashtra: మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేసిన విష‌యంపై హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. గ‌తంలో ఆమె మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం, ఆమె ముంబైలో అడుగుపెట్టొద్ద‌ని శివ‌సేన హెచ్చ‌రిక‌లు చేయ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కంగ‌నా ర‌నౌత్ స్పందిస్తూ… ”చెడు ఆధిప‌త్యం ఎక్క‌డ ఉంటే, అక్క‌డ విధ్వంసం ఆస‌న్న‌మ‌తుంది. ఆ త‌ర్వాత అక్క‌డ మ‌ళ్ళీ అభివృద్ధి జ‌ర‌గాల్సి ఉంటుంది. జీవిత క‌మ‌లం విక‌సిస్తుంది” అని ఆమె శివ‌సేనను, బీజేపీని ఉద్దేశించి పేర్కొంది.

Maharashtra: ప్ర‌భుత్వ ఏర్పాటుపై బీజేపీ భేటీ.. ఫ‌డ్న‌వీస్ ఇంటికి ఏక్‌నాథ్ షిండే

”న‌మ్మ‌కంతో కూడిన వ్య‌వ‌స్థనే ప్ర‌జాస్వామ్యం అని అంటామ‌ని నేను 2020లో చెప్పాను. ఈ న‌మ్మ‌కంతో కూడిన వ్య‌వ‌స్థ‌ను అధికార దాహంతో నాశ‌నం చేయాల‌నుకునేవారు, చివ‌ర‌కు వారే నాశ‌నం అయిపోతారు. వారి అహంకారం కూడా నాశ‌న‌మైపోతుంది. శివుడి 12వ అవ‌తార‌మే హ‌నుమంతుడు.. హ‌నుమాన్ చాలీసాను నిషేధించిన శివ‌సేనను శివుడు కూడా కాపాడ‌లేడు. హ‌ర‌హ‌ర మ‌హాదేవ.. జై హింద్, జై మ‌హారాష్ట్ర” అని కంగ‌నా ర‌నౌత్ వీడియో రూపంలో మాట్లాడింది. కాగా, నిన్న రాత్రి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)