Virat Kohli Birthday: మూడు ఫార్మాట్లలో ‘కింగ్’ కోహ్లీ.. విరాట్ కెరియర్‌లో రికార్డుల జాబితా..

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కోహ్లీ 24వేలకు‌పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీతో మొత్తం 71 సెంచరీలు చేసి క్రికెట్ ప్రపంచంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు

Virat Kohli Birthday: మూడు ఫార్మాట్లలో ‘కింగ్’ కోహ్లీ.. విరాట్ కెరియర్‌లో రికార్డుల జాబితా..

virat kohli

Updated On : November 5, 2022 / 10:45 AM IST

Virat Kohli Birthday: క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ తన కెరియర్ లో ఎన్నో మైలురాళ్లను అదిగమించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. టెస్ట్, వన్డే, టీ20 ఇలా ఏ ఫార్మాట్ లోనైనా విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లు బౌలర్లు ఒళ్లుదగ్గర పెట్టుకొని బౌలింగ్ చేస్తుంటారు. అయినా కోహ్లీ క్రిజ్ లో పరుగుల వరద పారిస్తుంటాడు.

Virat Kohli 34th Birthday

Virat Kohli 34th Birthday

2011జూన్ 20న వెస్టెండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఫార్మాట్ లో కోహ్లీ అరంగ్రేటం చేశాడు. అప్పటి నుంచి నేటికీ ఈ ఫార్మాట్ లో తన పరుగుల ప్రవాహానాన్ని కోహ్లీ కొనసాగిస్తూనే ఉన్నాడు. మొత్తం 102 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. 8,074 పరుగులు చేశాడు. అందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. జూలై 2016, జూలై 2017 మధ్య కాలంలో కోహ్లీ 67.04 సగటుతో తన ఆరు సెంచరీలలో నాలుగింటిని డబుల్స్‌గా మార్చాడు. 2019లో ఆస్ట్రేలియాలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయంతో కోహ్లి భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ అయ్యాడు.

Virat Kohli 34th Birthday

Virat Kohli 34th Birthday

వన్డేల్లోనూ కోహ్లీ తన రికార్డుల పరంపరను కొనసాగించాడు. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌తో తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌ను కోహ్లీ ప్రారంభించాడు. అప్పటి నుంచి మొత్తం 262 వన్డేలు ఆడిన కోహ్లీ 12,344 రన్స్ చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 64 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.

Virat Kohli 34th Birthday

Virat Kohli 34th Birthday

2010లో జ్వింబాంబేతో జరిగిన మ్యాచ్ ద్వారా కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి నేటి వరకు 113 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. ఒక సెంచరీ, 36అర్థ సెంచరీలతో 3,932 పరుగులు చేశాడు. టీ20ల్లో కెరీర్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు (53.13).

Virat Kohli 34th Birthday

Virat Kohli 34th Birthday

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్ లలో కోహ్లీ 24వేలకు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీతో మొత్తం 71 సెంచరీలు చేసి క్రికెట్ ప్రపంచంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు (81 ఇన్నింగ్స్‌లు) చేసిన ఆటగాడు కోహ్లీ.

Virat Kohli 34th Birthday

Virat Kohli 34th Birthday

వన్డేల్లో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000 మరియు 12,000 పరుగులను కోహ్లీ చేరుకున్నాడు. T20లలో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు అందుకొని అత్యధిక సార్లు అవార్డు అందుకున్న క్రికెటర్ గా నిలిచాడు. టీ20ల్లో (15) అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. అదేవిధంగా T20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు (3,932) చేశాడు.

Virat Kohli 34th Birthday

Virat Kohli 34th Birthday

కోహ్లీ వన్డేల్లో వెస్టిండీస్ జట్టుపై అత్యధిక తొమ్మిది సెంచరీలు చేశాడు. టెస్టుల్లో భారత్ (68) కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక విజయాలు (40) కోహ్లీ సాధించాడు.

Virat Kohli 34th Birthday

Virat Kohli 34th Birthday

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్ కోహ్లీ. వన్డేల్లో విజయవంతమైన ఛేజింగ్‌లతో భారత్ తరఫున అత్యధికంగా 26 సార్లు కోహ్లీ సెంచరీలు చేశాడు.