మధ్యప్రదేశ్‌లో కొత్త మంత్రి వర్గం.. సింధియా శిబిరంలో 10మందికి చోటు

  • Published By: vamsi ,Published On : July 2, 2020 / 12:44 PM IST
మధ్యప్రదేశ్‌లో కొత్త మంత్రి వర్గం.. సింధియా శిబిరంలో 10మందికి చోటు

Updated On : July 2, 2020 / 1:31 PM IST

మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం రెండవ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్ర గవర్నర్ ఆనంద బెన్ పటేల్.. రాజ్ భవన్ వద్ద మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేశారు. 20 మంది క్యాబినెట్ మంత్రులు, 8 మంది రాష్ట్ర మంత్రులు సహా మొత్తం 28 మంది మంత్రులు ఇవాళ(02 జులై 2020) ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో గోపాల్ భార్గవ, విజయ్ షా, యశోధర రాజే సింధియాతో సహా చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ వద్ద జాతీయ గీతంతో ప్రారంభమైంది. క్యాబినెట్ మంత్రులుగా బిజెపి నాయకులు యశోధర రాజే సింధియా, భూపేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. హర్సూద్ అసెంబ్లీకి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ షాతో పాటు గోపాల్ భార్గవ కూడా రాహ్లీ అసెంబ్లీ సీటు నుంచి ప్రమాణ స్వీకారం చేశారు.

వాస్తవానికి, ఆరుగురు మంత్రులు, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేందుకు కారణం అయ్యారు. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కమల్ నాథ్ మార్చి 20వ తేదీన రాజీనామా చేశారు. శివరాజ్ చౌహాన్ ఈ ఏడాది మార్చి 23న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ సమయంలో, శివరాజ్ చౌహాన్ ఒంటరిగా ఒక నెల పాటు ప్రభుత్వాన్ని నడిపాడు.

24 సీట్లలో బైపోల్స్:

మధ్యప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో 24 సీట్లలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాబట్టి, ఎన్నికల సమయంలో ఆ ప్రదేశాల ప్రజలను బలోపేతం చేయడంపై పార్టీ దృష్టి పెట్టింది. ఈ ఎపిసోడ్‌లో సింధియాతో వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి బిజెపికి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరయ్యారు. సింధియా శిబిరానికి చెందిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం లభించింది.

Read:Indiaలో కరోనా..6 లక్షల కేసులు..ఒక్కరోజులో 434 మంది మృతి