Maharashtra : కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రకాంత్‌ జాదవ్‌ కన్నుమూత

మహారాష్ట్ర నార్త్ కొల్హాపూర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చంద్రకాంత్‌ జాదవ్‌ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రకాత్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Maharashtra : కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రకాంత్‌ జాదవ్‌ కన్నుమూత

Congress Mla Chandrakant Jadhav Passes Away

Updated On : December 3, 2021 / 1:40 PM IST

Congress MLA Chandrakant Jadhav Passes Away : మహారాష్ట్ర నార్త్ కొల్హాపూర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చంద్రకాంత్‌ జాదవ్‌ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రకాత్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఆయన మరణించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఓ ప్రకటించాయి. చంద్రకాంత్‌ జాదవ్‌ మృతికి కాంగ్రెస్ పార్టీనుంచి పలువురు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్‌ థోరాత్, పార్టీ వర్గీయులు, సన్నిహితులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన కొల్హాపూర్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా చంద్రకాంత్ ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. కొల్హాపూర్‌లో గొప్ప పారిశ్రామికవేత్తగా పేరుంది చంద్రకాంత్‌ జాదవ్‌ కు. ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఉత్తర కొల్హాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రకాంత్. శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్ క్షీరసాగర్ పై విజయం సాధించారు.

2020 ఆగస్టులోచంద్రకాంత్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. డాక్టర్ల సూచనలు మేరకు సర్జరీ కూడా చేయించుకున్నారు. తరువాత కోలుకున్నారు.కానీమరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది. గత వారం అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్‌ తరలించారు. చికిత్స పొందుతుండగా ఒక్కసారిగా ఒంట్లో రక్తం స్థాయి పడిపోవడంతో కన్నుమూశారు.