Mahesh Babu: సర్కారు వారి పాటను ముగించే పనిలో మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఓ పాట మినహా పూర్తయినట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.....

Mahesh Babu: సర్కారు వారి పాటను ముగించే పనిలో మహేష్!

Sarkaru Vaari Paata

Updated On : April 16, 2022 / 6:55 AM IST

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఓ పాట మినహా పూర్తయినట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట పూర్తి.. కానీ!

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించడంతో, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్‌ను ముగించే పనిలో ఉన్నాడు మహేష్. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసిన మహేష్, మరో రెండు రోజుల్లో డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తన వర్క్‌ను ముగించుకొని, అటుపై సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా మారేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Sarkaru Vaari Paata: సర్కారు పోస్ట్‌పోన్ రూమర్స్.. మాట తప్పేది లేదన్న మేకర్స్!

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘సర్కారు వారి పాట’ను చిత్ర యూనిట్ తెరకెక్కించగా ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన కళావతి, పెన్నీ సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా, త్వరలోనే ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.