మెగాస్టార్‌తో మంచు విష్ణు మీటింగ్ ఎందుకంటే..

మెగాస్టార్‌తో మంచు విష్ణు మీటింగ్ ఎందుకంటే..

Updated On : December 23, 2020 / 12:28 PM IST

Manchu Vishnu: మోహన్ బాబు తనయుడు, యువ కథానాయకుడు మంచు విష్ణు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరుతో చాలాసేపు ముచ్చటించానని చెబుతూ చిరుతో తీసుకున్న సెల్ఫీ పిక్ షేర్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా.. ‘బిగ్‌బాస్‌ చిరంజీవి అంకుల్‌ని ఈరోజు కలిశాను. ఎందుకు ఆయనని కలిశాననేది త్వరలోనే రివీల్‌ చేస్తాను. ఆయనకు ఎన్నో ప్రశ్నలు సంధించి.. సమాధానం రాబట్టుకునే గొప్ప అవకాశం నాకు దక్కింది. ఆయన ఇచ్చిన సమాధానాలతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన మెగాస్టార్‌ ఎందుకయ్యారో.. అనే విషయంలో అస్సలు ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు..’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో విష్ణు, చిరుని ఎందుకు కలిశాడబ్బా అనేది ఆసక్తికరంగా మారింది.

Mosagallu

విష్ణు, కాజల్, రుహీ సింగ్, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు నటించిన ‘మోసగాళ్లు’ త్వరలో విడుదల కానుంది. జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విష్ణు నిర్మించాడు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.