Minister KTR: గుడి, మసీదు, చర్చి కూడా కడతాం – కేటీఆర్

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పై కీలక ప్రకటన చేశారు. స్టేట్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో మసీదు, చర్చి, గుడి మూడు కడతామని హామీ ఇచ్చారు.

Minister KTR: గుడి, మసీదు, చర్చి కూడా కడతాం – కేటీఆర్

Minister Ktr (1)

Updated On : April 18, 2022 / 8:57 PM IST

 

 

Minister KTR: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పై కీలక ప్రకటన చేశారు. స్టేట్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో మసీదు, చర్చి, గుడి మూడు కడతామని హామీ ఇచ్చారు. టీడీపీ మాజీ నాయకుడు ట్విట్టర్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. నిర్మాణ పనుల్లో భాగంగా ధ్వంసమైన గుడి నిర్మాణ పనుల గురించి వేసిన ప్రశ్నకు బదులిచ్చారు.

“గుడి కూడా కడతాం, మసీదు కూడా, చర్చి కూడా కడతాం. మీరు నిశ్చింతంగా ఉండండి. ఇది కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ. అందరి నమ్మకాలను సమానంగా భావిస్తాం. మతాల పేరుతో రాజకీయాలు చేయకండి” అంటూ ట్వీట్ కు రెస్పాండ్ అవుతూ అన్నారు.

పాత సెక్రటేరియట్ బిల్డింగులను గతేడాది పడగొడుతున్న సమయంలో రెండు మసీదులు, ఒక గుడి డ్యామేజ్ అయ్యాయి. ఆ నిర్మాణాలు పాడవడం వల్ల విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. పలు మతనాయకులు చేసిన రిక్వెస్ట్ కు స్పందిస్తూ నిర్మాణాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వాటిని మరింత విశాలవంతంగా సిద్ధం చేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.