NTR : ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలి.. అది తెలుగు జాతికి దక్కేగౌరవం – మెగాస్టార్ చిరంజీవి..
ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా చిరంజీవి, ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

Ntr
NTR: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎదురులేని ‘ప్రజానాయకుడు’.. తిరుగులేని ‘కథానాయకుడు’.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, ‘అన్న గారు’ నందమూరి తారకరామారావు గారి జయంతి నేడు.. ఈ సందర్భంగా యావత్ తెలుగు ప్రజానీకం, తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నారా – నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారికి నివాళులర్పిస్తున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
‘‘ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపెన్ హజరికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే.. అది తెలుగువారికి గర్వకారణం.. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ..’’ అని చిరు ట్వీట్ ద్వారా ఎన్టీఆర్ గారికి నివాళులర్పించారు..
#RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021