Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ తో పొట్ట,నడుము చుట్టూ కొవ్వులు కరిగించుకోండిలా!

దీనిలో ఉండే ఎసిటిక్ ఆమ్లం ఉదర కొవ్వు, శరీర బరువు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, సోడియం మరియు ఫ్లోరిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి.

Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ తో పొట్ట,నడుము చుట్టూ కొవ్వులు కరిగించుకోండిలా!

apple cider vinegar

Updated On : August 15, 2022 / 5:46 PM IST

Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఆహార పదార్థాల్లో ఉపయోగించడమే కాకుండా చర్మ సంరక్షణలో సైతం వాడుతున్నారు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సమస్యలను నివారించటంలో ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా అధిక బరువు,పొట్ట భాగంలో కొవ్వు ను తొలగించటంలో సైతం దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే ఎసిటిక్ ఆమ్లం ఉదర కొవ్వు, శరీర బరువు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇందులో ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, సోడియం మరియు ఫ్లోరిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. పొట్ట, నడుపు చుట్టూ ఉండే కొవ్వులను కరిగించటంలో యాపిల్ సైడర్ వెనిగర్ తో తయారు చేసుకునే జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఆజ్యూస్ తయారీ విధానం ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

తయారీ విధానం ;

ముందుగా రెండు టీ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ ఒకటి, ఒక టీ స్పూను తేనే, కారప్పొడి, ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు తీసుకోవాలి. ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక టీ స్పూన్ తేనే,ఒక టీ స్పూన్ కారప్పొడి వేసి బాగా కలపండి భోజనం చేసే అరగంట ముందు ఇది త్రాగాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. కొద్ది వారాల్లోనే ఉదర కొవ్వు , నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి మీరు స్లిమ్ గా కనిపిస్తారు.