Errabelli Pradeep Rao resign : టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు

టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతకు ముందు ప్రదీప్‌రావుతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం జరిపిన మంత్రాంగం ఫలించలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Errabelli Pradeep Rao resign : టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు

Errabelli Pradeep Rao resign TRS

Updated On : August 7, 2022 / 8:55 PM IST

Errabelli Pradeep Rao resign : టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతకు ముందు ప్రదీప్‌రావుతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం జరిపిన మంత్రాంగం ఫలించలేదు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రదీప్‌రావు… టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని… ఎనిమిదేళ్ళుగా టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తగా నిస్వార్థంగా పనిచేసినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని… దమ్ముంటే రాజీనామా చేసి తనతో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. తాను ఏ పార్టీలో చేరనని.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని… దమ్ముంటే ఎమ్మెల్యే నరేందర్‌ ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు.

TS Politics : మాజీ మంత్రి తమ్మల పార్టీ మారతారా?

సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రదీప్‌ రావు చెప్పారు. ప్రస్తుతం వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఉన్నారు.