TS Politics : మాజీ మంత్రి తమ్మల పార్టీ మారతారా?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు..కార్యకర్తలు అన్నింటికి సిద్ధంగా ఉండాలి’ అంటూ కీలక సూచనలిచ్చారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా చూసుకోవాలంటూ సూచించారు. దీంతో తుమ్మల పార్టీ మారతారా? అనే అనుమానాలు తలెత్తాయి.

TS Politics : మాజీ మంత్రి తమ్మల పార్టీ మారతారా?

thummala key Comments : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు..కార్యకర్తలు అన్నింటికి సిద్ధంగా ఉండాలి’ అంటూ కీలక సూచనలిచ్చారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా చూసుకోవాలంటూ సూచించారు. మంత్రిగా ఉన్న సమయంలో డెవలప్ మెంట్ పై ఎక్కువ సమయం కేటాయించానని..కార్యకర్తల కోసం ఇప్పుడు పూర్తి సమయం కేటాయిస్తాను అంటూచెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని ఈ సందర్భంగా గుర్తు చేసిన తుమ్మల. ఇప్పుడు పాలేరు నియోజకవర్గంపై కాన్సన్ ట్రేట్ చేస్తానని అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలను దృష్టి పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

అలాగే మరో నిగూఢార్ధం కూడా తుమ్మల వ్యాఖ్యల్లో ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మలకు మరోసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఆలోచనతోనే తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారా?అనే ఆసక్తికర చర్చ మొదలైంది పాలేరు నియోజకవర్గంలో.

కాగా తెలంగాణలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జంపింగ్ జిలానీలు ఇప్పటినుంచే షురూ అయిపోతున్నాయి. దీనికి అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అతీతంగా లేదు. పార్టీ ఆశించి భంగపడిన నేతలతో పాటు పార్టీ టికెట్ దక్కి గత ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు కూడా పార్టీలు మారతారా? అనే ఆసక్తికర పరిణామాలు కొనసాగుతున్నాయి.

మరోపక్క బీజేపీ నేతలు కూడా తమ పార్టీకి టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు టచ్ లో ఉన్నారని..పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరటానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే.  కాగా.. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తుమ్మల ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతు నిర్వహించారు. 2014 ఆగస్టు 30న టీడీపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.