Minister Kodali: చీడపురుగుల్లా దోచుకుంటున్నారు.. కార్పొరేట్ ఆసుపత్రులపై మంత్రి కొడాలి!

ఒకవైపు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొందరు వైద్యులు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చీడపురుగులా దోచుకుతింటున్నారని ఏపీ పౌర సరఫరా శాఖామంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను అందిన వరకు దోచుకుతింటున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

Minister Kodali: చీడపురుగుల్లా దోచుకుంటున్నారు.. కార్పొరేట్ ఆసుపత్రులపై మంత్రి కొడాలి!

Minister Kodali Nani Fire On Corporate Hospitals In State

Updated On : May 27, 2021 / 6:00 PM IST

Minister Kodali: ఒకవైపు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొందరు వైద్యులు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చీడపురుగులా దోచుకుతింటున్నారని ఏపీ పౌర సరఫరా శాఖామంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను అందిన వరకు దోచుకుతింటున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. గుడివాడ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పటళ్లపై తీవ్రంగా స్పందించారు.

కరోనా రెండోదశలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండగా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉచ్చం నీచం మరిచి, కొందరు చీడపురుగుల్లా మారి దోచుకోవడం దారుణమని మండిపడ్డారు. ఈ శవాల మీద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలని.. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకుతినే హాస్పిటల్స్ ను అధికారులు ఫినిష్ చేయాలని సూచించారు. ఇలాంటి ఆసుపత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లవుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఒకటికి ఒకరు అండగా మహమ్మారిని జయించాలని సూచించారు.