Singareni Colony : వాణ్ని ఎన్ కౌంటర్ చేసుడే : మంత్రి మల్లారెడ్డి

ఇది చాలా ఘోరం. తప్పకుండా వాణ్ణి ఎన్ కౌంటర్ చేయాలి. ఎన్ కౌంటర్ చేస్తం. విడిచిపెట్టేదే లేదు.  వెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం.

Singareni Colony : వాణ్ని ఎన్ కౌంటర్ చేసుడే : మంత్రి మల్లారెడ్డి

Malla Reddy

Updated On : September 14, 2021 / 4:34 PM IST

Singareni Colony : హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఈనెల 12న జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసు సంచలనం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే… బహిరంగంగా ఉరి వెయ్యాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రమంతటా పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఉక్కిపిడికిలి బిగించి… నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలని నిరసనలతో హోరెత్తిస్తున్నారు.

Singareni Colony Rape Case : సింగరేణి కాలనీ చిన్నారి హత్య కేసు నిందితుడు అరెస్ట్ ?

మరోవైపు.. ఈ ఇష్యూపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. తెలంగాణ ఐటీ-మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే… మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. “ఇది చాలా ఘోరం. తప్పకుండా వాణ్ణి ఎన్ కౌంటర్ చేయాలి. ఎన్ కౌంటర్ చేస్తం. విడిచిపెట్టేదే లేదు.  వెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం. అన్నిరకాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. నిందితున్ని ఎన్ కౌంటర్ చేస్తాం” అని మల్లారెడ్డి అన్నారు.

Stabbed 23 Times: వృద్ధుడ్ని కొట్టి 20సార్లు కత్తితో పొడిచిన కొడుకు