Mohan Babu : ఫస్ట్ టైం బెంజ్ కారు ఎక్కించింది ఆయనే.. మా ఎలక్షన్స్‌లో పోటీ చేయమంది ఆయనే.. కృష్ణంరాజు గురించి చెప్తూ ఎమోషనల్ అయిన మంచు ఫ్యామిలీ..

మంగళవారం నాడు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు విచ్చేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించి ఆయన గురించి................

Mohan Babu : ఫస్ట్ టైం బెంజ్ కారు ఎక్కించింది ఆయనే.. మా ఎలక్షన్స్‌లో పోటీ చేయమంది ఆయనే.. కృష్ణంరాజు గురించి చెప్తూ ఎమోషనల్ అయిన మంచు ఫ్యామిలీ..

Mohan Babu and Manchu Vishnu emotional comments while remebering Krishnamraju

Updated On : September 14, 2022 / 7:58 AM IST

Mohan Babu :  ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్ కి తీరని లోటు. తాజాగా సినీ పరిశ్రమలోని కొన్ని యూనియన్లు, అసోసియేషన్లు కలిసి మంగళవారం నాడు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు విచ్చేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించి ఆయన గురించి మాట్లాడారు.

ఈ సంతాపసభలో కృష్ణంరాజు గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. ”నన్ను నోరారా అరేయ్‌ అని పిలిచే నటుడు కృష్ణంరాజు. నన్ను ఫస్ట్ టైం బెంజికారు ఎక్కించింది ఆయనే. ఆత్మీయులు ఎంత మంది దూరమైనా నేను ఏనాడు వాళ్ళ సంతాప సభలకు వెళ్ళలేదు. తొలిసారిగా సంతాప సభకు వచ్చాను. కృష్ణంరాజు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సకల దేవతలను కోరుకుంటున్నాను” అంటూ మోహన్‌బాబు ఎమోషనల్ అయ్యారు.

BiggBoss 6 : ఇదేం టాస్క్ రా బాబు.. పిల్లల బొమ్మల్నిచ్చి పిల్లల్ని పెంచమన్న బిగ్‌బాస్

ఇక మంచు విష్ణు కూడా ఈ సంతాప సభలో పాల్గొన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ”మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని కృష్ణంరాజు గారు నాకు చెప్పారు. మా నాన్న వద్దన్నా ఆయన చెప్పారని ఒప్పుకున్నారు. దాసరి గారి తర్వాత నేను అంతలా గౌరవించేది కృష్ణంరాజు గారినే. నెల రోజుల కిందటే ఆయనను కలిశాను. మా అసోసియేషన్‌లో జరిగే ప్రతి పనిని నేను కృష్ణం రాజు గారికి చెప్పేవాడిని. ఆయన మనకు భౌతికంగా దూరమైనా సినిమాలతో చిరకాలం మనతోనే ఉంటారు” అని మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు.