Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!

ముంబయి పోలీసులు చేసే ప్రతి పనిలో ఉత్తమంగా ఉంటారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ముంబయి పోలీస్ బ్యాండ్ వాయించిన అద్భుతమైన బాలీవుడ్ సాంగ్ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!

Mumbai police band

Updated On : May 24, 2023 / 2:50 PM IST

mumbai Khaki Studio : ముంబయి పోలీస్ బ్యాండ్ మరో మధురమైన ప్రోగ్రాంతో అందరి ముందుకి వచ్చింది. మంత్రముగ్ధుల్ని చేస్తూ వారు ప్లే చేసిన పాట ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ముంబయి పోలీసులు చేసే ప్రతిపనిలో ది బెస్ట్‌గా ఉంటారు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mumbai Police : ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయిన బస్సు.. డ్రైవర్‌కి సాయం చేసిన ప్యాసింజర్లు.. ముంబయి పోలీసులు షేర్ చేసిన వీడియో వైరల్

ముంబయి పోలీసుల మ్యూజికల్ ఆర్కెస్ట్రా, ఖాకీ స్టూడియో ఓల్డ్ మెలడీ సాంగ్‌తో మరోసారి ప్రదర్శన ఇచ్చింది. ఈసారి 1957 లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘పెయింగ్ గెస్ట్’ నుంచి ‘మన జనాబ్ నే పుకార నహిన్’ అనే సాంగ్‌ని అద్భుతంగా వాయించింది. ఈ బ్యాండ్‌కి నేవీ మాజీ సిబ్బంది సంజయ్ బాబాజీ కళ్యాణి డైరెక్షన్ చేశారు.

 

SD బర్మన్ పాటకు ఫ్లూట్, E ఫ్లాట్ క్లారినెట్, ఆల్టో సాక్సోఫోన్, ట్రంపెట్, యూఫోనియం, టేనోర్ శాక్సోఫోన్, ట్యూబా, పెర్కషన్ మరియు ట్రోంబోనులు ఉపయోగించారు. ముంబై పోలీసులు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా mumbaipolice లో ఈ పాట ఇన్‌స్ట్రుమెంటల్ వీడియోను పంచుకున్నారు.  మా ముంబయి పోలీస్ బ్యాండ్ ద్వారా ఐకానిక్ సాంగ్ ‘మన జనాబ్ నే పుకారా’ పాట వినండి అనే శీర్షికతో షేర్ చేశారు.

man dangerous bike stunt : ప్రియురాళ్లతో ఓ యువకుడి డేంజరస్ బైక్ స్టంట్.. ముంబయి పోలీసుల ట్వీట్

ముంబయి పోలీస్ బ్యాండ్ 1936 లో బ్రిటిష్ పాలనలో ప్రారంభమైంది. తర్వాత దీనికి అనుబంధంగా ఖాకీ స్టూడియో బ్యాండ్ ప్రారంభించారు. ఈ బ్యాండ్ ద్వారా అనేక ప్రభుత్వ, పబ్లిక్ కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Police (@mumbaipolice)