Mahesh Babu: దుఃఖంలోనూ మహేశ్‌ను నవ్వించిన బాలయ్య.. హ్యాట్సాఫ్ అంటోన్న అభిమానులు!

తండ్రిని కోల్పోయిన మహేశ్ బాబు నిన్నటి నుండి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. ఆయనకు వరుసగా ఎదురయిన విషాదాలతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణ భౌతికకాయానికి ఘన నివాళి అర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు వచ్చారు నందమూరి బాలకృష్ణ.

Mahesh Babu: దుఃఖంలోనూ మహేశ్‌ను నవ్వించిన బాలయ్య.. హ్యాట్సాఫ్ అంటోన్న అభిమానులు!

Nandamuri Balakrishna Brings Smile On Mahesh Babu Face

Updated On : November 16, 2022 / 3:45 PM IST

Mahesh Babu: తండ్రిని కోల్పోయిన మహేశ్ బాబు నిన్నటి నుండి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. ఆయనకు వరుసగా ఎదురయిన విషాదాలతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణ భౌతికకాయానికి ఘన నివాళి అర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు వచ్చారు నందమూరి బాలకృష్ణ.

Mahesh Babu: మహేశ్ బాబును ఓదార్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

కృష్ణగారితో ఆయనకున్న బంధాన్ని బాలయ్య ఈ సందర్భంగా గుర్తుచేసుకుని భాగోద్వానికి లోనయ్యారు. అటు మహేశ్ వరుసగా విషాదాలను ఎదుర్కోవడం చూసి బాలయ్య, మహేశ్‌ను దగ్గరకుతీసుకుని ఓదార్చారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి కూడా తీవ్ర విషాదంలో ఉన్న మహేశ్ మొహంపై బాలయ్య చిరునవ్వును తీసుకొచ్చాడు. వారి సంభాషణల మధ్య బాలయ్య మహేశ్‌ను నవ్వించడంతో దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు.

Mahesh Babu : అన్నయ్య అమ్మ ఇప్పుడు నాన్న.. మహేష్ బాబుకే ఎందుకిలా?

కష్టకాలంలో ఉన్న మహేశ్‌ను ఎట్టకేలకు నవ్వించిన బాలయ్యకు కృష్ణ, మహేశ్ అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. బాలయ్య మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. కానీ, కష్టాలను అధిగమించి ఇలా చిరునవ్వుతో ముందుకెళ్లాలని ప్రాక్టికల్‌గా మహేశ్‌కు చూపించిన బాలయ్యకు అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.