నవాజుద్దీన్ కుటుంబం చిత్ర హింసలు పెట్టింది – అలియా

నవాజుద్దీన్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు అతని భార్య అలియా. నవాజుద్దీన్ తనపై చేయి ఎత్తలేదు..కానీ..అతని కుటుంబ సభ్యులు మానసికంగా..శారీరకంగా..చిత్ర హింసలు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే కారణంగా మొదటి భార్య వెళ్లిపోయిందన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొననున్నట్లు ఇదివరకే అలియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాకు మరిన్ని విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల..ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపడం జరిగిందన్నారు. గత మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పిల్లలను చూడటానికి నవాజుద్దీన్ ఒక్కసారి కూడా రాలేదని, ఇద్దరు పిల్లలను తానే చూసుకుంటానని వెల్లడించారు.
నవాజుద్దీన్ తో బంధాన్ని ఇక కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని, ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడంతో..తనకు ఎవరూ లేరనే ఫీలింగ్ ఏర్పడిందన్నారు. నవాజుద్దీన్ సోదరుడు షమాస్ పెద్ద సమస్యగా మారాడని, ప్రస్తుతం తిరిగి తన పాత జీవితాన్ని ప్రారంభించబోతున్నానన్నారు. స్వలాభం కోసం మరొకరి పేరు వాడుకొనే ఉద్దేశ్యం తనకు లేదని, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించాలనే అభిప్రాయం వెలిబుచ్చారు. మరోవైపు నవాజుద్దీన్ సోదరుడు షమాన్ స్పందించారు.
విడాకుల విషయం మీడియా ద్వారా తెలిసిందని, చట్టపరంగా చర్యలు తీసుకొనే క్రమంలో..తాను కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. 2009లో అలియాను రెండో వివాహం చేసుకున్నారు నవాజుద్దీన్. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ప్రస్తులం విడాకులు కోరుతున్నట్లు అలియా ప్రకటించడంతో బాలీవుడ్ లో సంచలనంగా మారింది. దీనిపై నవాజుద్దీన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లో సెలెక్టెడ్ సినిమాలు ఎంచుకుంటూ..విలక్షణమైన పాత్రలను పోషిస్తున్నాడు. విభిన్నమైన పాత్రలతో మంచి నటుడిగా పేరు సంపాదించాడు.