Night Curfew : నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. రోజుకి మూడు షోలు మాత్రమే..
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా సింగిల్ స్క్రీన్స్‌లో రోజుకి రెండు షోలు మాత్రమే వేయాల్సి ఉంటుంది..

Night Curfew
Night Curfew: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా సింగిల్ స్క్రీన్స్‌లో రోజుకి రెండు షోలు మాత్రమే వేయాల్సి ఉంటుంది.
నైట్ కర్ఫ్యూ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని థియేటర్ల ఓనర్లు ఆందోళన చెందుతున్నారు.. కానీ రోజుకి నాలుగు షోలకు బదులు కనీసం మూడు షోలైనా వేస్తామని థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు. యధావిధిగా ఉదయం 11 గంటలకు మార్నింగ్ షో, మధ్యాహ్నం 2 గంటలకు మ్యాట్నీ, సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ షో వేస్తామని అంటున్నారు.
మరోవైపు… కొత్తగా విడుదలయ్యే సినిమాలపైనా నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉంటుందని నిర్మాతలు, బయ్యర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. ఈ సెకండ్ వేవ్‌తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు..