Minister Gadkari : త్వరలో టోల్ ప్లాజాలు తొలగింపు .. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంక్ ఎకౌంట్స్ నుంచే వసూలు

త్వరలో టోల్ ప్లాజాలను కేంద్ర ప్రభుత్వం తొలగించనుంది. టోల్ వసూళ్లు నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంక్ ఎకౌంట్స్ నుంచే వసూలుకానున్నాయని మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు.

Minister Gadkari  : త్వరలో టోల్ ప్లాజాలు తొలగింపు .. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంక్ ఎకౌంట్స్ నుంచే వసూలు

No toll plazas cameras to read number plates deduct toll

Updated On : August 24, 2022 / 3:39 PM IST

No toll plazas cameras to read number plates deduct toll : త్వరలో టోల్ ప్లాజాలను కేంద్ర ప్రభుత్వం తొలగించనుంది. అంటే ఇక టోల్ వసూళ్లు ఉండవేమో అని తెగ సంబరపడిపోతున్నారా? అదే కాదు టోల్ గేట్లు ఉండవుగానీ..టోల్ వసూళ్లు మాత్రం ఉంటాయి. మరి టోల్ ప్లాజాలుతొలగిస్తే వసూళ్లు ఎలా చేస్తారు అనే డౌట్ రావచ్చు. కానీ టెక్నాలజీ డెవలప్ మెంట్ లో భాగంగా ఏదైనా జరగొచ్చు.దాంట్లో భాగమే ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. కానీ ఇకపై ఇదికూడా ఉండదు. ఎలాగంటే నేరుగా ఇక బ్యాంక్ ఎకౌంట్ నుండే టోల్ వసూళ్లు జరిగిపోబోతున్నాయి. దీనికి సబంధించి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

షాస్టాగ్ వచ్చాక టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గిపోయింది. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే? వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. అదే ఉద్ధేవంతో కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే ప్రణాళిక దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

టోల్ ప్లాజాలు లేకపోతే టోల్ చార్జీ ఎలా వసూలు చేస్తారంటే..నంబర్ ప్లేట్ ను రీడ్ చేసే కెమెరాలు ఉంటాయి. వాటి ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఎకౌంట్ నుంచి ఛార్జీని వసూలు చేస్తారు. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించే ప్రక్రియ కొనసాగుతోంది అని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించామని తెలిపారు. ఫాస్టాగ్ విధానంలో కార్లపై ఆర్ఎఫ్డీ ట్యాగ్ స్టిక్కర్ వేస్తుండడం తెలిసిందే. నంబర్ ప్లేట్లను రీడ్ చేసే విధానంలో వీటి అవసరం ఉండదు.

దీనికి గురించి మంత్రి గడ్కరి మాట్లాడుతూ ‘‘కంపెనీ ఫిట్ చేసిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రోడ్లపైకి రావాలని 2019లో నిబంధనలు తెచ్చాం. గత నాలుగేళ్లలో రోడ్లపైకి వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లు డిఫరెంట్ ఉంటున్నాయి. కార్లకు ఈ తరహా నంబర్ ప్లేట్లు లేకపోతే నిర్ణీత సమయంలోగా వాటిని అమర్చుకునే విధంగా నిబంధనలు తేవాలి’’ అని వివరించారు. ప్రస్తుతం టోల్ ఛార్జీల్లో 97 శాతం అంటే సుమారు రూ.40,000 కోట్లు ఫాస్టాగ్ ల ద్వారా వసూలు అవుతున్నాయని..తెలిపారు మంత్రి గడ్కరి.

ఫాస్టాగ్ లు వచ్చాక దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ తగ్గుముఖం పట్టినట్లుగా లెక్కలు చెబతున్నాయి. ఇక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడ్ కెమెరాల విధానంతో వాహనాలకు ఆటంకాలు మరింత తగ్గుతుంది. తద్వారా ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా సాఫీగా జరగటానికి వీలు కలుగుతుంది.